NTV Telugu Site icon

Sangareddy: కొడుకు మృతిని తట్టుకోలేక ఆగిన తండ్రి గుండె..

Sangareddy

Sangareddy

అమ్మ ప్రేమ కనిపిస్తుంది.. నాన్న ప్రేమ కనిపించదు కానీ నడిపిస్తుంది. పిల్లలే తమ ప్రపంచంగా బ్రతుకుతూ.. ఆ పిల్లల ఇష్టాల కోసం కష్టాన్ని కూడా సంతోషంగా భరిస్తున్న తండ్రులేందరో ఉన్నారు. తన పిల్లలకి చిన్న కష్టం వస్తేనే తల్లడిల్లిపోయే వ్యక్తి నాన్న.. అలాంటిది చెట్టంత కొడుకు ఇక లేడు.. ఎప్పటికి రాడని తెలిస్తే..? ఆ తండ్రి గుండె తట్టుకోగలదా..? గుండె చప్పుడు ఆగిపోయిన పోవచ్చు, ఇలాంటి సంఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

Read Also: Bussiness Idea: తక్కువ పెట్టుబడి తో లక్షల్లో ఆదాయం .. ఓ లుక్ వేసుకోండి..

అయితే, సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గొంగ్లూర్ తండాలో నివాసం ఉంటున్న బీమ్లా అనే వ్యక్తి ఆందోల్ మండలం అన్నాసాగర్ దగ్గర రోడ్ ప్రమాదం జరగడంతో అతడు అక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలిసిన బీమ్లా తండ్రి తట్టుకోలేక పోయారు, చేతికొచ్చిన కొడుకు తన కళ్ళముందే నిర్జీవంగా పడి ఉండటంతో చూసి జీర్ణించుకోలేని బీమ్లా తండ్రి ధర్మా నాయక్ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి పోయారు. ఒకే రోజు గంటల వ్యవధిలో తండ్రి కొడుకులు ఇద్దరు మృతి చెందడంతో పుల్కల్ మండలం గొంగ్లూర్ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ఇక ధర్మా నాయక్ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఇక తండ్రికొడుకులు ఒకేసారి చనిపోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read Also: Dhanraj : స్టేజ్ పైనే ఏడ్చేసిన కమెడియన్ ధనరాజ్.. అయ్యో పాపం..