Dhanraj : స్టేజ్ పైనే ఏడ్చేసిన కమెడియన్ ధనరాజ్.. అయ్యో పాపం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జబర్దస్త్ కమెడీయన్ ధనరాజ్ కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. జబర్ధస్త్ కామెడీ షోతో ఎంతోమంది కమెడియన్లు బుల్లితెరపైనే కాదు వెండితెపై కూడా తమ సత్తా చాటుతున్నారు.. అందులో ఈ ధనరాజ్ ఒకడు. తన కామెడీతో నవ్వులు పూయిస్తూ వచ్చాడు..జబర్ధస్త్ లో టీమ్ లీడర్ గా కొనసాగుతూనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తనదైన కామెడీ మార్క్ చాటుకున్నాడు ధన్ రాజ్. మొదటి నుంచి తనదైన మేనరీజం అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఓ షోలో ధన్ రాజ్ వెక్కి వెక్కి ఏడ్చాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఆ వీడియో పై కామెంట్స్ కూడా వస్తున్నాయి
అసలు విషయానికొస్తే.. ధనరాజ్ కామెడికి నవ్వని వాళ్ళు అస్సలు ఉండరు.. బుల్లితెరపై జబర్ధస్త్ షో లో టీమ్ లీడర్ గా మంచి హాస్యాన్ని పండించాడు. బుల్లితెరపై నటిస్తూనే వెండితెరపై తన సత్తా చాటాడు. ఒకటీ రెండు చిత్రాల్లో హీరోగా కూడా నటించాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా పాల్గొని అందరి మనసు గెలిచాడు. బిగ్ బాస్ హౌజ్ లో 41 రోజుల పాటు కొనసాగి పదో స్థానంలో నిలిచాడు. జబర్ధస్త్ కామెడీ షోకి గుడ్ బై చెప్పి ఓ ప్రముఖ ఛానెల్లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా నవ్వులు పూయించాడు. ప్రస్తుతం వెండితెరపై బిజీగా ఉంటున్న ధన్ రాజ్ ఆ మద్య ఓ తమిళ సినిమాలో కూడా నటించి తన మార్క్ లో చూపించి ఆకట్టుకున్నాడు..
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
- Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
ఆ షోలో ఇటీవల జరిగిన ఓ ఎపిసోడ్ లో చాలా మంది సీనియర్ బుల్లితెర నటులు తన ప్రదర్శన ద్వారా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ధన్ రాజ్ మాట్లాడుతూ చాలా ఎమోషన్ కి గురై కన్నీరు పెట్టుకోవడం అందరినీ కన్నీరు పెట్టించింది. ధన్‌రాజ్ మాట్లాడుతూ.. మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదు.. చిన్న వయసులో నాన్న ఆలనా.. పాలన నాకు తెలియదు. నాన్న ఇలా ఉంటాడేమో అని ఊహించుకునేవాన్ని. నాకు రక్త సంబంధం అనేదే లేదు.. నాకు ఏదైనా రక్త సంబంధం ఉంటే.. నా పిల్లలతోనే మొదలైందంటూ ధన్ రాజ్ తన కుటుంబ సభ్యులను చూపించాడు… తన పెద్ద కొడుకు కూడా తండ్రిని చూసి ఎమోషనల్ అయ్యారు.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది..
తాజావార్తలు
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
-
Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
-
Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!