Sangareddy: సంగారెడ్డి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపుతుంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ని సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. ఎందుకు ర్యాగింగ్ చేస్తున్నారంటూ సీనియర్స్ పై విద్యార్ధి సోదరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆగ్రహంతో శాంతినగర్ లోని విద్యార్ధి ఇంటికి వెళ్లి మరి సీనియర్స్ దాడి చేశారు. దీంతో సీనియర్లు, జూనియర్ల మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ గ్యాంగ్ వార్ లో ఓ విద్యార్థికి విరిగిన చేయి, మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి.
Read Also: MH370 Mystery: ఇప్పటికైనా MH370 మిస్టరీ వీడుతుందా.? దశాబ్ధం క్రితం 239 మందితో విమానం అదృశ్యం..
అయితే, ఈ గొడవపై పోలీసులకు కాలనీ వాసులు సమాచారం ఇచ్చారు. దీంతో హూటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘర్షణకు కారణమైన వారిని పట్టుకుని సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. ఇక, సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్‌ను నిరోధించడానికి కాలేజీ యాజమాన్యం యాంటీ-ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీతో పాటు పోలీసులు కూడా ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా అవగాహన కల్పించాలని తెలిపారు.
