MH370 Mystery: ఇప్పటికైనా MH370 మిస్టరీ వీడుతుందా.? దశాబ్ధం క్రితం 239 మందితో విమానం అదృశ్యం..
- ఇప్పటికీ మిస్టరీగానే MH370 విమానం..
- 11 ఏళ్లు గడిచినా బయటపడని రహస్యం..
- ప్రపంచ దేశాలు గాలించినా కనిపించని ఫలితం..
- మరోసారి సెర్చ్ ఆపరేషన్‌కు మలేషియా గ్రీన్ సిగ్నల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MH370 Mystery: మలేషియా ఎయిర్ లైన్స్‌కు చెందిన MH370 మిస్సింగ్ మిస్టరీ ఇప్పటికీ పరిష్కారం కాలేదు. విమానం అదృశ్యమై 11 ఏళ్లు అవుతున్నా, అసలు ఈ విమానానికి ఏమైంది, ఎక్కడ కూలిపోయింది అనేది ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. విమానానికి సంబంధించిన శకలాలు, ప్రయాణికుల మృతదేహాల ఆనవాళ్లు కూడా కనిపించలేదు. అయితే, మరోసారి ఈ విమానం కోసం అన్వేషణ తిరిగి ప్రారంభిస్తామని మలేషియా ప్రభుత్వం ప్రకటించింది. అనేక సార్లు విమానాన్ని కనుగొనడంలో తమ ప్రయత్నాలు విఫలమైనప్పటికీ, మరోసారి అణ్వేషించడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతోంది.
మార్చి 8, 2014న కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు 227 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో ప్రయాణమైన బోయింగ్ 777 విమానం అనూహ్యంగా అదృశ్యమైంది. విమానం అకస్మాత్తుగా రాడార్ నుంచి తప్పిపోయింది. ఇది విమానయాన చరిత్రలోనే రహస్యాలలో ఒకటిగా మిగిలిపోయింది.
Also Read
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
బుధవారం, మలేషియా రవాణా మంత్రిత్వ శాఖ MH370 కోసం శోధన కార్యకలాపాలు డిసెంబర్ 30న తిరిగి ప్రారంభమవుతాయని తెలిపింది. అమెరికాకు చెందిన సముద్ర అన్వేషన్ సంస్థ ఓషన్ ఇన్ఫినిటీ ఈ మిషన్‌ను నిర్వహిస్తోంది. ఈ విమానం కుప్పకూలినట్లు భావిస్తున్న ప్రాంతాల్లో శోధిస్తుందని మలేషియా ప్రభుత్వం చెబుతోంది. బాధితులకు కుటుంబాలు తమ వారికి ఏమైందో తెలుసుకోవాలని అనుకుంటున్నారు, ఇందు కోసమే మళ్లీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు మలేషియా తెలిపింది.
11 ఏళ్లుగా రహస్యం:
విమానం అదృశ్యమైన ఒక రోజు తర్వాత, మార్చి 9, 2014న మొదటి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది. మలేషియా రాయల్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మాట్లాడుతూ.. సైనిక రాడార్ డేటా అధ్యయనం తర్వాత విమానం అండమాన్ సముద్రం మీదుగా తిరిగి వెళ్లి ఉండొచ్చని చెప్పారు. ఒక ఏడాదికి పైగా ఎలాంటి శిథిలాలు కనిపించలేదు. జూలై 2015లో, విమానానికి చెందిన కుడి రెక్క నుంచి ఒక ఫ్లాపెరాన్ హిందూ మహాసముద్రంలోని రియూనియన్ ద్వీపంలోకి కొట్టుకు వచ్చింది. దీని తర్వాత దెబ్బతిన్న సూట్ కేస్, చైనీస్ వాటర్ బాటిల్, ఇతర వస్తువులు ఆస్ట్రేలియా సమీపంలో గుర్తించారు. కానీ అవి విమానంలోని ప్రయాణికుల నుంచి వచ్చాయో లేదో అధికారులు నిర్ధారించలేకపోయారు. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో చైనా, భారతదేశం, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, వియత్నాం, UK, US వంటి దేశాల నుండి ఓడలు, విమానాలు పాల్గొన్నాయి. ఇన్ని ప్రయత్నాలు చేసిన విమానానికి చెందిన ప్రధాన భాగాల్ని కనుగొనలేకపోయారు.
లాస్ మెసేజ్ ‘‘గుడ్ నైట్’’:
కౌలాలంపూర్ నుంచి బీజింగ్ బయలుదేరిన 40 నిమిషాల తర్వాత విమానం నుంచి చివరిసారిగా ట్రాన్స్‌మిషన్ జరిగింది. కెప్టెన్ జహారీ అహ్మద్ షా “గుడ్ నైట్, మలేషియన్ త్రీ సెవెన్ జీరో”తో సైన్ ఆఫ్ చేసాడు. అదే సమయంలో విమానం వియత్నాం గగనతలంలోకి ప్రవేశించింది. కొంత సమయం తర్వాత దాని ట్రాన్‌పాండర్ ఆఫ్ చేయబడింది. దీంతో విమానాన్ని ట్రాక్ చేయడం సాధ్యం కాలేదు. మిలిటరీ రాడార్ ప్రకారం.. విమానం తన మార్గం నుంచి తప్పినట్లు తెలుస్తోంది. మలేషియా, పెనాంగ్ ద్వీపం మీదుగా ఇండోనేషియా సుమత్రా ద్వీపం కొనలో ఉన్న అండమాన్ సముద్రంలోకి వెళ్లినట్లు చూపించింది. ఆ తర్వాత దక్షిణం వైపు తిరిగి అన్ని సంబంధాలను కోల్పోయింది.
మలేషియా, ఆస్ట్రేలియా, చైనా దక్షిణ హిందూ మహాసముద్రంలోని 120,000 చదరపు కి.మీ (46,332 చదరపు మైళ్ళు) ప్రాంతంలో ఇన్‌మార్‌శాట్ ఉపగ్రహం, విమానం మధ్య ఆటోమేటిక్ కనెక్షన్ డేటా ఆధారంగా నీటి అడుగున సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. దాదాపుగా 143 మిలియన్ డాలర్లను విమాన శోధన కోసం ఖర్చు చేశారు. విమానం జాడ తెలియకపోవడంతో జనవరి 2017లో సెర్చింగ్ నిలిపేశారు.
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!