Site icon NTV Telugu

Raghunandan Rao: దేశద్రోహులకు, కాంగ్రెస్‌కు ఉన్న సంబంధం బయటపడింది..

Raghu

Raghu

Raghunandan Rao: సంగారెడ్డి జిల్లాలోని జిన్నారంలో మత ఘర్షణలో అరెస్ట్ అయిన బీజేపీ కార్యకర్తను సంగారెడ్డి సెంట్రల్ జైలులో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిన్నారంలో ఏం జరుగుతుందో విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను నాలుగుసార్లు ఎంపీగా అడిగినా సరైన సమాధానం లేదు అని పేర్కొన్నారు. దేశద్రోహులను వెంటనే పంపించాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చినా.. ఇప్పటికి అధికార యంత్రాంగం స్పందించడం లేదు అని ఆరోపించారు. దేశద్రోహులకు, కాంగ్రెస్‌కు ఉన్న సంబంధం బయటపడింది అని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.

Read Also: Manoj Naravane: ‘‘యుద్ధం అంటే రొమాంటిక్ కాదు, మీ బాలీవుడ్ సినిమా కాదు’’: మాజీ ఆర్మీ చీఫ్

అయితే, జిన్నారం, పటాన్ చెరుల్లో ఉన్న మదర్సాలలో చదువు చెప్పేందుకు ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి వివరణ ఇవ్వకపోతే హిందూ బంధువులు విడుదలైన తర్వాత పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగుతాం అని హెచ్చరించారు. జిన్నారం మదర్సాపై జిల్లా ఎస్పీ సరైన సమాధానం ఇవ్వకపోతే డీవోపీటీకి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. మీరు దేశ ద్రోహులకు మద్దత్తు ఇస్తున్నారా అని రఘునందన్ రావు తెలిపారు.

Exit mobile version