Weather Update: తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం 8 గంటల తర్వాత కూడా చల్లటి గాలులు వీస్తున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో గత పది రోజులుగా సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జిల్లా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లాలో నమోదు అయ్యింది. చలి తీవ్రతతో కూలీలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఉదయం బయటకి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు. దుప్పట్లు, స్వెటర్లు కప్పుకుని రోజువారీ పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Read also: Top Headlines @9AM : టాప్ న్యూస్
జిల్లాల వారీగా ఉష్ణోగ్రతలు..
* సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ లో 7.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు
కోహిర్ 9.2, గుమ్మడిదల 9.2, సత్వార్ 9.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.
* ఆదిలాబాద్ జిల్లా అర్లిటీలో 8.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు.
* కొమురం భీం జిల్లా సిర్పూర్ యు లో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు.
* నిర్మల్ జిల్లా పెంబి లో 10.9 డిగ్రీలుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు.
* మంచిర్యాల జిల్లా జన్నారంలో 14.2 డిగ్రీలుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు.
* మెదక్ జిల్లా శివంపేటలో 8.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.
* సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.
* సిద్దిపేట జిల్లా కోట్‌గిరిలో 10.4, కొండపాకలో 10.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు.
* పటాన్‌చెరులో 12.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.
* హనుమకొండలో 13.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.
* పెద్దపల్లి జిల్లా రామగుండంలో 13.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.
* నిజామాబాద్‌లో 14.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు.
* వికారాబాద్ జిల్లా మరిపల్లిలో 10.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Pushpa 2: మేరీ జాన్ ముంబై.. ఇండియన్ సినిమా ‘కింగ్’ వస్తున్నాడు!