NTV Telugu Site icon

Jaggareddy: నాకు సీఎం కావాలని కోరిక ఉంది.. కచ్చితంగా సీఎం అవుతా

Jaggareddy

Jaggareddy

Jaggareddy: సంగారెడ్డిలో సోమవారం దసరా ఉత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు సీఎం కావాలని కోరిక ఉంది. మీరు ఇలాగే ఆశీర్వదిస్తే ఇంకో పదేళ్లకు నేను తెలంగాణకి సీఎం అయ్యి తీరుతానని జగ్గారెడ్డి అన్నారు. విజయదశమి నాడు నా మనసులో మాట చెబుతున్నానన్నారు. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి.. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని.. దీన్ని ఎవరైనా కాదనగలరా అని ఆయన ప్రశ్నించారు.

Read Also: Nara Bhuvaneshwari: “నిజం గెలవాలి” కార్యక్రమంతో ప్రజల్లోకి నారా భువనేశ్వరి

ఈ కాలం ఎప్పుడైనా నిర్ణయించినా.. నేను మాత్రం కచ్చితంగా సీఎం అవుతానని కీలక వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో తన నోరు, చేతులు కట్టేశారని లేకపోతే మరిన్ని విషయాలను చెప్పే వాడినని జగ్గారెడ్డి అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తినని చెప్పారు. నియోజకవర్గంలో తాను అందుబాటులో లేక పోయినా.. తన భార్యతో పాటు అనుచరులు ఉంటారన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా వెంటనే అక్కడికి వెళ్లిపోతానని చెప్పారు. ప్రజల ఆశీస్సులు ఎప్పుడూ తనపై ఉండాలని జగ్గారెడ్డి కోరారు.

Read Also: Gold Price Today : పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

Show comments