Site icon NTV Telugu

Double Bedroom Scam: డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో మోసం.. 2.5 కోట్లు దోచేసిన BHEL ఉద్యోగి

Srd

Srd

Double Bedroom Scam: సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తానని పేదలను నమ్మించి ఓ వ్యక్తి మోసం చేశాడు. అమీన్ పూర్ మండలం కిష్టారెడ్డిపేటకు చెందిన బీహెచ్ఈఎల్ ఉద్యోగి ప్రసన్న కుమార్ పై బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. జోష్ బ్రదర్ అనే మధ్యవర్తి‌ ద్వారా పరిచయమైన ప్రసన్న కుమార్.. ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ. 3 లక్షల నుంచి నాలుగైదు లక్షలు వసూలు చేశాడని పేర్కొంటున్నారు. మొత్తం 69 మంది దగ్గర నుంచి రూ. రెండు కోట్ల 50 లక్షల రూపాయల వరకు మోసం చేశాడని ఆరోపణలు చేస్తున్నారు. అయితే, జోష్ అనే వ్యక్తి ద్వారా డబ్బులను ప్రసన్న కుమార్ దండుకున్నాడు.. 2021 నుంచి నేడు, రేపు ఇప్పిస్తామంటూ ప్రసన్న కుమార్ మాయమాటలు చెప్తున్నాడని బాధితులు పేర్కొంటున్నారు.

Read Also: CP Sajjanar: అర్ధరాత్రి సీపీ సజ్జనార్ పెట్రోలింగ్.. రౌడీషీటర్ల ఇళ్లలో తనిఖీలు

అయితే, కిష్టారెడ్డిపేటలోని ప్రసన్న కుమార్ ఇంటికి వెళ్తే వాచ్ మెన్, కుక్కలతో దాడి చేయించాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ లో బీహచ్ఈఎల్ ఉద్యోగి ప్రసన్నకుమార్ పై ఫిర్యాదు చేశారు. జోష్ ను నిలదీయగా ప్రసన్న కుమార్ కే మొత్తం డబ్బులు ఇచ్చానని చెప్తున్నాడు. దీంతో తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. మాకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వకపోయినా సరే, మా డబ్బులు మాకు ఇప్పించాలని వేడుకుంటున్నారు.

Exit mobile version