NTV Telugu Site icon

DK Aruna: సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకు..?

Dk Aruna

Dk Aruna

DK Aruna: సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకు..? అని ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. సంగారెడ్డి జైలులో లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన వారినీ బీజేపీ ఎంపీలు డీకే అరుణ పరామర్శించారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ.. పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందని తెలిపారు. సీఎం రేవంత్ సోదరుడు అక్కడ ఉన్న రైతులను భయపెట్టారని ఆరోపించారు. భూములు ఎలాగైనా గుంజుకుంటామని చెప్పారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఘటన తర్వాత రాత్రి గ్రామాల్లోకి వచ్చి పోలీసులు ఇష్టం వచ్చినట్టు దాడి చేశారన్నారు. గొడవ జరిగిన ఘటనలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వదిలేసి.. మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. భూములు ఇవ్వమని చెబితే సీఎం రేవంత్ స్వయంగా వెళ్లి వాళ్ళని కలిసి మాట్లాడితే బాగుండని సూచించారు. కానీ ఇవన్నీ చేయకుండా భయపెట్టి దాడులు చేపించి ఇలా చేయడం కరెక్టు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సోదరుడు అక్కడికి వెళ్ళవచ్చు కానీ నన్ను అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. రైతులతో దౌర్జన్యంగా బెదిరించి సంతకాలు పెట్టించుకుంటున్నారని తెలిపారు.

Read also: Mulugu: ఆ గ్రామానికి అరిష్టం పట్టింది.. జంగాలపల్లిలో వరుస మరణాల కలకలం..

మీరు సీఎం అయితే.. మా నియోజకవర్గం బాగుంటుంది అనుకుంటే.. మీరు జనాలపై కక్ష కట్టారని తెలిపారు. సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకు..? అని ప్రశ్నించారు. ఓటేసి గెలిపించిన జనాల కంటే.. మీకు ఫార్మా కంపెనీ ముఖ్యమా సీఎం రేవంత్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కొడంగల్ వాసులు కాదు వలస వచ్చారన్నారు. మీకు నచ్చిన వారికి కంపెనీలు అప్పజెప్పడానికే ఫార్మా కంపెనీలు పెడుతున్నారన్నారు. వెంటనే లగచర్ల బాధితులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంథాలు వద్దు నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష ముఖ్యం అని సలహాఇచ్చారు. పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయిండు అని మండిపడ్డారు. మీరు 11 నెలలకే పేదల ఉసురు పోసుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూసి ప్రజల ఉసురు కూడా పోసుకోవడం కరెక్ట్ కాదని తెలిపారు. గర్భిణీ స్త్రీ అని చూడకుండా ఇలా చేయడం దారుణమన్నారు. సీఎం రేవంత్ అహంకారం వీడాలి..ఒప్పించి భూములు తీసుకోవాలని డీకే అరుణ సూచించారు.
V.C. Sajjanar: అర‌చేతిలో వైకుంఠం చూపించ‌డం అంటే ఇదే..!! సజ్జనార్ ట్వీట్ వైరల్..

Show comments