Sammakka Sarakka: ఈ నెల 29, 30 తేదీల్లో మేడారంలో అమ్మవార్ల దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు సమ్మక్క, సారలమ్మ పూజారులు తెలిపారు. ఆదివారం అమ్మవార్ల గద్దెల ఆవరణలో అర్చకులు, భాగస్వామ్య వర్గాల సమావేశం నిర్వహించారు. వరంగల్‌లోని మేడారం సమ్మక్క, సారలమ్మ కార్యాలయాలను ఖాళీ చేయించి తమ ఆధీనంలోకి తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారని భద్రకాళి దేవస్థానం అర్చకులు ఆరోపించారు. 1972లో అప్పటి మంత్రి పోరిక జగన్నాయక్ వరంగల్‌లో మేడారం జాతర కార్యాలయానికి స్థలం కేటాయించగా భద్రకాళి, మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి ఆలయాల నుంచి నిధులు సేకరించి 2కోట్లతో నగరం నడిబొడ్డున కార్యాలయాన్ని నిర్మించారు. ఈ భవనంలోనే మతతత్వ శాఖ కార్యాలయాలన్నీ కొనసాగుతున్నా.. అమ్మవార్లకు కేటాయించిన స్థలంలో కార్యాలయాన్ని కొనసాగించాలని కోరారు. ఈ క్రమంలో రెండు రోజుల పాటు దర్శనం నిలిపివేస్తామని, అధికారులు స్పందించకుంటే జూన్ మొదటి వారంలో వరంగల్‌లో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Read also: Top Movies In 2024: ఈ ఏడాది 100 కోట్లు రాబట్టిన సినిమాలు ఇవే..
సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 21, 2024న ప్రారంభమై 24న ముగిసింది. మొత్తం నాలుగు రోజుల పాటు జాతరను తిలకించిన లక్షలాది మంది భక్తులు మధురస్మృతితో నింపుకుని స్వగ్రామాలకు వెళ్తున్నారు. మళ్లీ రెండేళ్లలో వస్తాం అంటూ మేడారాన్ని భారంగా బయలుదేరారు. కాగా. కోరిన కోరికలను తీర్చే ఇష్టదైవాలను తలుచుకుంటూ ఇంటి బాట పడుతున్నారు. ఈసారి కోటి 35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక.. మేడారం జాతర విజయవంతంగా నిర్వహించారు. జాతర విజయవంతానికి కృషి చేసిన ప్రజలు, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మంత్రి సీతక్క. అయితే.. జాతరలో వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా తమ వంతు కృషి చేశామని పేర్కొన్నారు. ఇక.. 20 శాఖల అధికారులు జాతర పనుల్లో పూర్తిగా నిమగ్నమయ్యారని సీతక్క తెలిపారు. అంతే కాకుండా.. అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ వారు నిరంతరం పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.
East Godavari: నన్నయ్య యూనివర్సిటీలో భద్రపరిచిన ఈవీఎంలు.. 144 సెక్షన్ అమలు..