Sammakka Sarakka: ఈ నెల 29, 30 తేదీల్లో మేడారంలో అమ్మవార్ల దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు సమ్మక్క, సారలమ్మ పూజారులు తెలిపారు. ఆదివారం అమ్మవార్ల గద్దెల ఆవరణలో అర్చకులు, భాగస్వామ్య వర్గాల సమావేశం నిర్వహించారు. వరంగల్‌లోని మేడారం సమ్మక్క, సారలమ్మ కార్యాలయాలను ఖాళీ చేయించి తమ ఆధీనంలోకి తీసుకోవాలని దేవాదాయ శాఖ అధికారులపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నారని భద్రకాళి దేవస్థానం అర్చకులు ఆరోపించారు. 1972లో అప్పటి మంత్రి పోరిక జగన్నాయక్ వరంగల్‌లో మేడారం జాతర కార్యాలయానికి స్థలం…