గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సినిమాల జాతర కాస్త ఎక్కువగానే ఉంది.. అందులోనూ స్టార్ హీరోల సినిమాల కన్నా చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.. ముఖ్యంగా మలయాళంలో ఇప్పటివరకు విడుదలైన సినిమాలు అన్ని కూడా భారీ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాదు రూ.100 కోట్లను క్రాస్ చేశాయి.. సంక్రాంతి నుంచి ఇప్పటివరకు విడుదలైన సినిమాలు, అవి రాబట్టిన కలెక్షన్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ ఏడాది విడుదలైన సినిమాలు దాదాపుగా రూ. 100 కోట్లకు పైగా వసూల్ చేశాయి.. అందులో మలయాళం సినిమాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది 5 సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి. అవేంటంటే.. ముంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు, ఆవేశం, ది గోట్ లైఫ్,మరో సినిమా 83 కోట్లు అందుకుంది..
అలాగే టాలీవుడ్ లో మూడు సినిమాలు వంద కోట్ల క్లబ్ లోకి చేరాయి.. అవేంటంటే హనుమాన్, గుంటూరు కారం, టిల్లు స్క్వేర్.. ఇక తమిళ్ సినిమాల విషయానికొస్తే.. అయాలాన్, కెప్టెన్ మిల్లర్ మూవీస్ వంద కోట్లకు దగ్గర్లో ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు పది సినిమాలు ఉన్నాయి.. ఇక జూన్ నుంచి డిసెంబర్ వరకు స్టార్ హీరోల సినిమాలు లైన్లో ఉన్నాయి.. ఆ సినిమాల్లో ఎన్ని వంద కోట్లకు పైగా రాబడుతాయో చూద్దాం..