ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు ‘సమతా కుంభ్’: చిన్నజీయర్ స్వామి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు సమతా కుంభ్ – 2023 జరగనుందని చిన్న జీయర్ స్వామి ప్రకటించారు. ఈమేరకు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన వివరాలు తెలిపారు. ఫిబ్రవరి రెండు నుంచి పన్నెండు వరకు శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయని పేర్కొన్నారు. ముచ్చింతల్‌లో సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం గతేడాది ఫిబ్రవరి 2న ప్రారంభమైందని. 216 అడుగుల పంచలోహ విగ్రహం లోకానికి అందుబాటులోకి వచ్చిందన్నారు.
“సమతా మూర్తి కేంద్రం ప్రారంభమై ఏడాది పూర్తి అవుతుంది. 108 దివ్య ప్రదేశాలు సమతా మూర్తి కేంద్రంలో ఉన్నాయి. ఈ ఏడాదిలోనే కోట్లాది మంది సమతా మూర్తి కేంద్రాన్ని సందర్శించారను. అనేక మంది గత బ్రహ్మోత్సవాలను తిలకించారు.. చూస్తూ చూస్తుండగానే ఒక ఏడాది పూర్తి అయ్యింది.. ఫిబ్రవరి 2 న మొదటి వార్షికోత్సవం జరపబోతున్నాం. నిరుడు లాగే అదే స్థాయిలో వేడుక సాగుతుంది. 9 కుండాలతో ఉండే యాగశాలను ఏర్పాటు చేసి యాగం నిర్వహించనున్నాం. సమతా కుంభ్ పేరుతో ప్రతి సంవత్సరం వేడుకలు నిర్వహిస్తాం” అని చిన్నజీయర్ స్వామి స్పష్టం చేశారు.
Also Read
- CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
- Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
- Revanth Reddy: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎప్పుడంటే..?
- Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్‌నాథ్‌సింగ్ కీలక వ్యాఖ్యలు
బ్రహ్మోత్సవ కార్యక్రమాలు..
- మొదటి రోజు ఫిబ్రవరి రెండు గురువారం నాడు విశేషోత్సవాలు..
- ఫిబ్రవరి మూడు శుక్రవారం ఉదయం సూర్యప్రభ వాహన సేవ, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ..
- ఫిబ్రవరి నాలుగు శనివారం సమతామూర్తికి కృతజ్ఞతాంజలి కీర్తన,రామానుజ నూత్తాందాది సామూహిక పారాయణ..
- ఐదో తారీఖు ఆదివారం సాయంత్రం సకల లోక రక్షకుడికి 108 రూపాలలో చారిత్రాత్మక, అద్భుత శాంతి కళ్యాణ మహోత్సవం..
- ఆరవ తారీఖు సోమవారం నాడు ఉదయం వసంతోత్సవం, సాయంత్రం 18 గరుడసేవలు..
- ఏడో తేదీన మంగళ వారం ఉదయం డోలోత్సవం,హనుమ ద్వాహన సేవ,18 గరుడ సేవలు..
- ఎనిమిదో తేదీన బుధవారం ఉదయం కల్హారోత్సవం, సామూహిక పుష్పార్చన, సాయంత్రం లీలా విహారికి 18 రూపాల్లో తెప్పోత్సవం..
- తొమ్మిదో తేదీన గురువారం ఉదయం సువర్ణ రామానుజులకు ఆచార్య వరి వస్య, సాయంత్రం అశ్వ వాహన సేవ,18 గరుడ సేవలు..
- పదో తేదీన శుక్రవారం ఉదయం సామూహిక ఉపనయనములు, సాయంత్రం గజవాహన సేవ 18 గరుడ సేవలు..
- పదకొండో తేదీన శనివారం ఉదయం రథోత్సవం, చక్ర స్నానం, మధ్యాహ్నం సకల లోక గురుడికి విశ్వశాంతి విరాట్ గీతా పారాయణ..
- ఆఖరి రోజు పన్నెండవ తేదీన ఆదివారం ఉదయం ఉత్సవాన్త స్నపనము, సాయంత్రం మహా పూర్ణాహుతి,కుంభ ప్రోక్షణ తో పాటు వివిధ కార్యక్రమాలు జరుగుతాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ‘ఓట్ చోరీ చేసిన బీజేపీ.. ఇప్పుడు సీట్ చోరీ చేసింది’.. మీనాక్షి నటరాజన్ ఘటనపై సీఎం ఫైర్..
-
Trigrahi Raja Yoga: జూన్ 15న మిథున రాశిలో “త్రిగ్రాహి రాజయోగం”.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
-
Meenakshi Natarajan: నాది బూటకపు కేసు కాదు.. మీనాక్షి నటరాజన్ ఫిర్యాదుదారు కీలక వ్యాఖ్యలు
-
Revanth Reddy: కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎప్పుడంటే..?
-
Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్‌నాథ్‌సింగ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!