బీజేపీపై మరోసారి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని బాగు చేసుకుంటున్నామని, బీజేపీ బండి సంజయ్ ది ప్రజా సంగ్రామ యాత్ర కాదు అది.. అంతర్గత సంఘర్షణ యాత్ర అంటూ సెటైర్లు వేశారు. బండి సంజయ్ మాటలు చాలా ఆశ్చర్యం కల్గించాయని, విద్వేషాలు రెచ్చగొట్టే ఎజెండా బండి సంజయ్‌ది అంటూ ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. విధానాలతో రాలేదు.. విద్వేషాలతో బండి సంజయ్ యాత్ర చేస్తున్నారని ఆరోపించారు సబిత.
రాష్ట్ర విభజన హామీలపై అమిత్ షాను అడిగిన ఉపయోగం లేదని, తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు, సంస్థలు ఇవ్వాలని అమిత్ షాను డిమాండ్ చేస్తున్నామన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పూర్తి కాకుండా ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారని, అది బీజేపీ నేతలకు తెలుసుని వ్యాఖ్యానించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అమిత్ షాను డిమాండ్ చేశారు సబితా ఇంద్రారెడ్డి.