NTV Telugu Site icon

Traffic Jam: టోల్​ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్​ టైంవేస్ట్ చేసుకోవద్దన్న సజ్జనార్​

Sajjanar

Sajjanar

Traffic Jam: సంక్రాంతి పండగ రద్దీ మొదలైంది. విద్యాసంస్థలకు వారం రోజుల సెలవులు రావడంతో పండగ జరుపుకునేందుకు స్వగ్రామాలకు తరలిపోతున్నారు. దీంతో.. ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు ప్రధాన కూడళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రైళ్లు, బస్సుల్లో సీట్లు దొరక్క పండక్కి వెళ్లేవారు పిల్లాపాపలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో సమయం వృథా చేసుకోవద్దని ఆర్టీసీ ఎండీ సజ్జానార్ సలహా ఇచ్చారు.

ఇక.. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించండని సూచించారు. సంక్రాంతికి సొంత వాహనాల్లో వెళ్లి టోల్‌ ప్లాజాల వద్ద గంటల తరపడి నిరీక్షించి మీ సమయాన్ని వృథా చేసుకోకండంటూ సలహా ఇచ్చారు. #TSRTC బస్సుల్లో ప్రయాణించి టోల్‌ప్లాజాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక లేన్ల ద్వారా వేగంగా గమ్యస్థానాలకు చేరుకోండని తెలిపారు. మా సిబ్బంది మిమ్ముల్ని క్షేమంగా సొంతూళ్లకు చేర్చుతారంటూ ట్వీట్‌ చేశారు సజ్జనార్‌. ఇక.. పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లో 21 టిక్కెట్‌ కౌంటర్లను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించింది. దీంతో సాధారణ రోజుల్లో 12 మాత్రమే ఉండేవి ఇక అదనపు సిబ్బందిని నియమించామని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు. దీంతో.. రైళ్లు ఏ సమయానికి.. ఏ ప్లాట్‌ఫామ్‌కు వస్తాయనేది ఎప్పటికప్పుడు ప్రకటించడమే కాకుండా సహాయకులను అదనంగా సమకూర్చామన్నారు. ఇక.. టిక్కెట్‌ తనిఖీ సిబ్బందిని 20 నుంచి 40కి పెంచామన్నారు. దీంతో.. టిక్కెట్‌ తనిఖీ సిబ్బందిని రెట్టింపు చేశామన్నారు. ఈనేపథ్యంలో.. 60 మంది ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది.. 30 మంది జీఆర్పీ నిత్యం విధుల్లో ఉండేలా చూస్తున్నామన్నారు.
Doctors Not Negligent: ఇద్దరు బాలింతల మృతి.. వైద్యుల నిర్లక్ష్యం ఎక్కడా లేదన్న డాక్టర్‌ సునీత

Show comments