NTV Telugu Site icon

RS Praveen Kumar: నేడు బీఆర్‌ఎస్‌ లోకి ఆర్‌ఎస్పీ.. నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీ..

Rs Praveen Kumar

Rs Praveen Kumar

RS Praveen Kumar: తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇటీవలే బీఎస్పీకి రాజీనామా చేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయనకు గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ప్రవీణ్‌కుమార్‌ ట్విటర్‌ వేదికగా మాట్లాడుతూ.. ‘ఆదివారం హైదరాబాద్‌లోని వందలాది మంది అభిమానులు, శ్రేయోభిలాషులతో నా రాజకీయ భవిష్యత్తుపై మేధోమథనం చేశాను. నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నన్ను అనుసరిస్తానని హామీ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని లౌకికవాదం, రాజ్యాంగ పరిరక్షణ, బహుజనుల అభ్యున్నతి కోసం ఇవాళ కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నాను. బహుజనులు ప్రతిచోటా మహనీయుని సిద్ధాంతాన్ని తమ హృదయాలలో పదిలంగా దాచుకుంటారు.

Read also: MLC Kavitha Husband Anil: నేడు సుప్రీంకు ఎమ్మెల్సీ కవిత భర్త..! మరి ఈడీ విచారణకు..?

తమ కలలను సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతామని పోస్ట్ చేశారు. కాగా, బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పోటీ చేయనున్నారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రవీణ్ కుమార్ సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ గురుకుల పాఠశాలల సొసైటీ కార్యదర్శిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన కొద్ది గంటల్లోనే సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. అప్పుడు ఆయన వెనుక ఉన్నది కేసీఆర్ అని, కేసీఆర్ వదిలిన బాణం ఆర్ఎస్పీ అని విమర్శలు వచ్చాయి. వీఆర్‌ఎస్‌ వెనుక టీఆర్‌ఎస్‌ హస్తం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడేళ్ల క్రితం నాటి వార్త ఇప్పుడు తన ఎఫైర్‌తో కన్ఫర్మ్ అయింది. కేసీఆర్ నియంత అని, ఆయన్ను గద్దె దించకుంటే తెలంగాణకు భద్రత ఉండదని ఇలాంటి అనేక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయనతో పాటు ఆర్ఎస్పీ కూడా చేరడం గమనార్హం.
Singer Mangli: సింగర్ మంగ్లీకి తప్పిన పెను ప్రమాదం.. స్వల్ప గాయాలు!