Site icon NTV Telugu

Hyderabad Parks: హైదరాబాద్ సిటీ పార్కుల్లో షీ టీమ్స్ నిఘా.. పట్టుబడితే ఫైన్..!

Indrapark

Indrapark

Hyderabad Parks: హైదరాబాద్‌లోని పలు పబ్లిక్ పార్కుల్లో చాలా కాలంగా సామాన్యులను ఇబ్బంది పెడుతున్న సమస్యపై పోలీసులు దృష్టి సారించారు. సాయంత్రం పూట కుటుంబసభ్యులు, పిల్లలతో సరదాగా గడుపడానికి వెళుతున్నవారికి అక్కడికి వచ్చిన జంటల చేస్తున్న చేష్టలు ఇబ్బందిగా మారింది. ఎవరు చూస్తున్నా, ఏం చేస్తున్నా కూడా.. యువ జంటలు పార్కుల్లో వెకిరి చేష్టలతో తెగ ఇబ్బందికి గురవుతున్నారు. పొదల దగ్గర బహిరంగంగా.. బెంచీల మీద కూర్చుని ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం చాలా ఇబ్బంది కరంగా మారుతుంది. ముఖ్యంగా ఇందిరాపార్క్, కృష్ణకాంత్ పార్క్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలు తరచూ కనిపిస్తున్నాయి. ఆ ప్రేమలో మునిగి తేలుతున్న జంటలకు ఇవి మామూలు విషయాలుగానే అనిపించినా వారిని చూస్తున్న వారికి మాత్రం చాలా కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులకు కనిపిస్తే వారికి ఊహించని ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. కాలేజ్ పూర్తి చేసి రిలాక్స్ అయ్యేందుకు వచ్చే యువత కూడా దీని వల్ల దారి తప్పే ప్రమాదం ఉంది. ఆఫీసులో పని ముగించుకుని నడుచుకుంటూ వచ్చే పెద్దలకు ఇది కాస్త ఇబ్బంది.

Read also: Chandrababu: రాజకీయ జీవితంలో ఎన్నడూ చేయనంత కసరత్తు చేశాం..

అయితే గతంలో ఇందిరాపార్క్‌ యాజమాన్యం దీన్ని చక్కదిద్దేందుకు కొన్ని ప్రయత్నాలు చేసినా వివాదంగా మారింది. పార్క్‌లోని ప్రశాంత వాతావరణానికి భంగం కలగకుండా, 2021 ఆగస్టులో, పార్క్ వెలుపల ‘పెళ్లి కాని జంటలకు అనుమతి లేదు’ అని యాజమాన్యం బోర్డు పెట్టింది. ఇది వివాదాస్పదంగా మారడంతో వెనక్కి తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయా పార్కుల్లో యువ జంటలు ప్రేమాయణం సాగిస్తున్నారు. దీంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన షీ టీమ్స్ శుక్రవారం రంగంలోకి దిగింది. పార్కులు మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో అనుచితంగా ప్రవర్తించినందుకు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్, కృష్ణకాంత్ పార్క్ మరియు అనేక బహిరంగ ప్రదేశాల్లో జంటలను షీ టీమ్ పట్టుకుంది. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని కౌన్సెలింగ్ ఇచ్చి జరిమానా విధించి అక్కడి నుంచి పంపించేశారు. బహిరంగ ప్రదేశాల్లో సామాన్యులకు ఇబ్బంది కలిగించే పనులు చేయరాదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ హెచ్చరించింది. ఇక నుంచి బహిరంగ ప్రదేశాల్లో నిఘా ఉంటుందని షీ టీం అధికారులు వెల్లడించారు.
Pawan Kalyan: సీట్ల ప్రకటన తర్వాత పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు

Exit mobile version