Wines Theft: వైన్స్‌లో భారీ చోరీ.. రూ.80 వేల మందు బాటిళ్లు మాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wines Theft: ఈ మధ్యన దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు, బ్యాంకులే కాకుండా వివిధ రంగాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ దొంగలు కూడా అలాగే అనుకున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 80 వేల విలువైన మందు బాటిళ్లను దొంగలించారు. వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా రెండు రోజులు వైన్ షాప్ లు బంద్ ఉండాలని పోలీసులు ప్రకటించారు. ఎంటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఫుల్ గా మందు తాగి డ్యాన్స్ చేయడం అందరి ఇబ్బంది పెట్టడం జరగకూడదని వైన్ షాప్ లను బంద్ చేశారు. అయితే దీని తట్టుకోలేక పోయారో.. రెండు రోజులు బంద్ చేస్తే మేము తగ్గుతామా అనుకున్నరో ఏమో గానీ ప్లాన్ ప్రకారం వచ్చి వైన్ షాప్ లో మందు బాటిళ్లను దొంగలించి పరారయ్యారు. అయితే.. ఈ దొంగతనం చేసింది నిజంగానే దొంగేనా లేకా మందుబాబులా అనే సందేహం కలుగుతుంది.
Read also: Rashi Phalalu : ఈ రోజు ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామ శివారులో వెంకటేశ్వర వైన్స్ ఉంది. మంగళవారం అర్థరాత్రి యథావిధిగా.. వైన్స్ మూసివేసి తాళాలు వేసి.. సిబ్బంది వెళ్లిపోయారు. కట్ చేస్తే.. బుధవారం ఉదయం వైన్స్ తెరవడానికి వచ్చిన యజమాని సారా సంతోష్ గౌడ్ షాక్ కు గురయ్యాడు. వచ్చేసరికి షెట్టర్ కాస్త తెరిచి ఉంది. దీంతో… వెంటనే తన భాగస్వామి దామోదర్ రెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పగా… అతడు కూడా గురై వైన్స్ వద్దకు వచ్చాడు. ఇద్దరూ వైన్స్ పూర్తిగా తెరిచారు. షాప్ అంతా గందరగోళంగా ఉంది. దాదాపు రూ. 80 వేల మద్యం సీసాలు కనిపించలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అన్ని వైన్స్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. దొంగతనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. చోరీ జరిగిన తీరు చూస్తుంటే.. తెలిసిన వాళ్లెవరో ఈ పని చేసి ఉంటారని యజమానులు అనుమానిస్తున్నారు. వైన్స్ షాప్ సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. వీరికి తెలిసిన వారేనా? లేక అసలు దొంగలు ఈ పని చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Credit Card: ఇన్ కమ్ ప్రూఫ్ లేకున్నా క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు