రోడ్డు ప్రమాదం….ప్రాణాలు కోల్పోయిన అన్నాచెల్లెళ్ళు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్లపై రక్తదాహం కనిపిస్తోంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ సమీపంలో ఘోరరోడ్డు ప్రమాదం కుటుంబంలో విషాదం నింపింది. కొత్తూరు పరిధిలోని తిమ్మాపూర్ శివారులో లారీ, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో అన్నాచెల్లెలు ప్రాణాలు కోల్పోయారు. మహబూబ్‌నగర్ జిల్లా ముసాపేట్ మండలం కొమ్మిరెడ్డిపల్లికి చెందిన చంద్రశేఖర్… హైదరాబాద్ జీడిమెట్లలో ఉంటున్నారు. వనపర్తి జిల్లాలో బంధువుల ఇంట్లో శుభకార్యానికి సోదరి మమతతో కలిసి వెళ్ళారు చంద్రశేఖర్.
అక్కడినించి తిరిగి హైదరాబాద్ వస్తుండగా లారీ రూపంలో విధి వెంటాడింది. కొత్తూరు మీదుగా బైక్‌పై వేగంగా వస్తూ… పెట్రోల్ బంక్‌లోకి వెళ్తున్న లారీ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో యువతీయువకుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వివాహానికి వెళ్లి వస్తూ.. విగతజీవులుగా మారిన అన్నాచెల్లెలిని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ చనిపోవడంతో బంధువులు విషాదంలో మునిగిపోయారు.
Also Read
తాజావార్తలు
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..