నల్గొండ జిల్లా మిర్యాలగూడ చింతపల్లి హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్ ఢీ కొట్టింది. అయితే.. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో పది మంది కి తీవ్ర గాయాలు అయ్యాయి. Ap39x6414 నెంబర్ గల శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్సు ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక క్షత గాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఈ ప్రమాదానికి బస్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణమని భావిస్తున్నారు పోలీసులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు… కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.