దేవుడి దర్శనం కోసం వెళ్లిన ఒక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడంతో.. వారి కుటుంబంలో రోధనలు మిన్నంటాయి… కర్ణాటకలోని బీదర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీదర్‌లోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. కంటైనర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది కారు.. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జైంది… ఈ ప్రమాదంలో ఐదురుగు మృతిచెందగా.. మరో ఐదురుగు తీవ్రగాయాలపాలయ్యారు.. నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు.. చిన్నారి సహా ఐదుగురు ఒకే ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు మృతిచెందారు.. హైదరాబాద్ బేగంపేటకు చెందిన గిరిధర్ (45), ప్రియ (15), అనిత (30), మహేక్ (2), డ్రైవర్ జగదీష్ (35) మృతిచెందినట్టుగా గుర్తించారు పోలీసులు.. ఇక, గీత, రజిత, ప్రభావతి, షాలిని, హర్షవర్ధన్ ఆసుపత్రిలో చేరారు..
హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు గిరీధర్.. దైవదర్శనం కోసం కర్ణాటక రాష్ట్రానికి వెళ్లారు.. కలబురగి జిల్లా గంగాపూర్‌కు చెందిన దత్తాత్రేయను దర్శించుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన గిరీధర్ ఫ్యామిలీలోని 10 మంది కారులో బయల్దేరి వెళ్తుండగా.. బీదర్ తాలూకా బంగూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనపై బీదర్ తాలూకా మన్నల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఒకే ఫ్యామిలీకి చెందిన ఐగురు ఒకే సారి ఐదుగురి ప్రాణాలు పోవడంతో.. విషాదంగా మారింది.
