RJ Swathi: కేటీఆర్ పై అద్భుతమైన ర్యాప్.. పాడి రఫ్పాడించిన ఆర్ జే స్వాతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RJ Swathi: మంత్రి కేటీఆర్ నిన్న రేడియో మిర్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు ఆర్జే స్వాతి స్వాగతం పలికారు. కేటీఆర్ ను ఆర్ జే స్వాతి సార్ సార్ అంటూ నాపేరు ఆర్ జే స్వాతి అని మీ మీద ఒక పాటరాసాను పాడతాను అన్నారు. ఇప్పుడా అంటూ కేటీఆర్ అనగానే అక్కడున్న వారందరూ నవ్వుకుంటారు. అయితే ప్లీస్ సార్ అంటూ స్వాతి అనగానే సరే పాడండి అంటూ కేటీఆర్ నిలబడ్డారు. అంతే కేటీఆర్ పై అద్భుతమైన ర్యాప్ పాడి రఫ్పాడించారు ఆర్.జే స్వాతి. ఇక ఆర్ జే స్వాతి పాట పాడటం మొదలు.. హైదరాబాద్ సిటీని, కేటీఆర్ ను ఉద్దేశించి హైదరాబాద్ అంటేనే హైపర్ గా ఉంటాం!. బిర్యానీ తింటూనే ఇరానీ ఛాయ్ అంటాం. మండే టు ఫ్రైడే ఆఫీసుకే పోతాం. మెట్రో ఎక్కి దిగేదాకా ముచ్చట్లే పెడతాం. ఐటీ మాదే.. ఫార్మా మాదే.. స్కైక్ వాకు మీద మేము క్యాట్ వాక్ చేస్తాం. కేబుల్ బ్రిడ్జి ఎక్కి మేము కేరింతలు కొడతాం.. అంబేద్కర్ బొమ్మకేమో సెల్యూట్ కొడతాం.. ఫస్ట్ మనమే.. బెస్ట్ మనమే.. సాటి లేని స్కిల్ ఉన్న సిటీ మాదే! అన్నింట్లో అవార్డులు మనమే.. బోనాల పండుగకు పూనకాలు ఊగుతాం.. దసరా పండుగకు బోనాలే ఆడతాం.. మనది హైద్రాబాదు.. దేశంలో మనమే జోరు.. మన కేటీఆరు.. ఇగ సూడర జోరు అంటూ హుషారైన ర్యాప్ పాడి అక్కడ ఉన్న వారిని ఆకట్టుకుంది. ఆర్ జే స్వాతి ర్యాప్‌కు మంత్రి కేటీఆర్ ముగ్ధుడై ఆమెకు అభినందనలు తెలిపారు.
అనంతరం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో గిరిజన పారిశ్రామికవేత్తల సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ హాజరయ్యారు. సీఎం కేసీఆర్ మారుమూల ప్రాంతంలో పుట్టారని, ముంబైలోని షాపూర్ జీ పల్లోంజీ కంపెనీతో ఒప్పందాలు చేసుకున్నారని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చాక సింగిల్ విండో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయానని చెప్పారు. అయినా పట్టుదలతో ముందుకు సాగాడు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ ఇక వెనుదిరిగి చూడలేదు. గిరిజన పారిశ్రామికవేత్తలను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ఐదు వేల మంది యువకులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. అవసరమైతే ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా ప్రొడక్ట్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. మీరందరూ భవిష్యత్ తరాలకు మార్గదర్శకులు కావాలని సూచించారు.
Also Read
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
- Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
- Harish Rao: చేనేత కార్మికుల కళా నైపుణ్యానికి, కష్టానికి, అంకితభావానికి సెల్యూట్..
- Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
Sri Sathya Sai District: శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం.. భవనంపై నుండి దూకి విద్యార్ధిని మృతి..
తాజావార్తలు
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
-
Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
-
KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!