NTV Telugu Site icon

Medigadda: మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌కు పెరుగుతున్న వరద

Medigadda

Medigadda

Medigadda: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌కు నీటి ప్రవాహం పెరుగుతోంది. ఎగువ మహరాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 8,790 క్యూసెక్కుల ప్రాణహిత నుంచి వరద వచ్చి చేరుతోంది. బ్యారేజ్‌లో గేట్లను ఎత్తి ఉంచి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. దెబ్బతిని కుంగిన ఏడో బ్లాక్‌లో 20 వ గేటును కూడా కట్ చేసి అధికారులు తొలగించారు. వచ్చిన నీటిని వచ్చినట్లుగా ఇరిగేషన్ అధికారులు దిగువకు తరలిస్తున్నారు. బ్యారేజ్‌లో తాత్కాలిక‌‌ మరమ్మతులు చివరి దశకు‌ చేరుకున్నాయి. బ్యారేజ్ రక్షణ చర్యలో భాగంగా ఎన్‌డీఎస్‌ఏ ఆదేశాల మేరకు గ్రౌటింగ్‌, షీట్‌ ఫైల్స్‌ పనులు పూర్తికాగా, అప్‌ అండ్‌ డౌన్‌ స్టీమ్‌లో చేపట్టిన సీసీ బ్లాక్‌ రీ అరేంజ్‌మెంట్‌ పనులు తుది దశలో ఉన్నాయి. మట్టి నమూనాల కోసం డ్రిల్లింగ్ మాత్రం ఇంకా కొనసాగుతోంది. కాగా.. వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం గేట్లు 85 ఉన్నాయి. వాటిలో 84 గేట్లను ఎత్తి ఉంచారు.

Read Also: Minister Sridhar Babu: ఆ భూములను వెనక్కు తిరిగి ఇవ్వాలి.. కేంద్ర మంత్రిని కోరిన శ్రీధర్‌ బాబు