Medigadda: మేడిగడ్డ బ్యారేజీ వద్ద పెరుగుతున్న వరద ప్రవాహం

  • మేడిగడ్డ బ్యారేజీకి వరద పోటు
  • ప్రాణహిత నుంచి వచ్చి చేరుతోన్న వరద
Medigadda

Medigadda

Medigadda: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద వరద ప్రవాహం పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రాణహిత నుంచి వరద వచ్చి చేరుతోంది. బ్యారేజీకి 14,500 క్యూసెక్కుల మేర వరద రాగా.. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సూచన మేరకు అన్ని గేట్లను ఎత్తి ఉంచారు. దీంతో వచ్చిన వరద వచ్చినట్లుగా దిగువకు వెళ్లిపోతోంది. వరద రావడంతో తాత్కాలిక పనుల కోసం తెచ్చిన యంత్రాలు, సామగ్రిని తరలించారు. ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Read Also: Tragedy: విషాదం.. మట్టి మిద్దె కూలి నలుగురు మృతి