Site icon NTV Telugu

రేవంత్‌రెడ్డి అరెస్టు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కాసేపటి క్రితమే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని… పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఆయనను అరెస్టు చేశారు పోలీసులు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవేల్లి లో… రచ్చబండ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి భారీ బందోబస్తుతో ఆయన ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. రేవంత్ రెడ్డి నీ అరెస్టు చేయడంతో ఆయన ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. అటు కాంగ్రెస్ నాయకుల పై పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. సీఎంకేసీఆర్‌ను గద్దె దించేంతవరకు పోరాటం ఆగదని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

Exit mobile version