Site icon NTV Telugu

రాష్ట్రంలో జరిగే దుర్మార్గ చర్యల వెనుక కేసీఆర్‌, మోడీ ఉన్నారు: రేవంత్‌ రెడ్డి

రాష్ట్రంలో జరిగే దుర్మార్గ చర్యల వెనుక కేసీఆర్‌, మోడీ ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అశు కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అశు ఎర్రబెల్లి గెలుపు కోసం గతంలో పని చేశారన్నారు. ఎర్రబెల్లి గెలిచిన తర్వాత అభివృద్ధిపై ఏ మాత్రం దృష్టి సారించకపోవడం, ఉద్యోగ నోటిఫికేషన్‌లపై మంత్రి ఎర్రబెల్లి కేసీఆర్‌పై ఒత్తిడి తేకపోవడంతోనే ఎర్రెబెల్లిపై విసిగిపోయార్నారు. అందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. రైతుల సమస్యల పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమస్య పరిష్కారం కనుగొనకుండా ఒకరిపై ఒకరు రాజకీయ ప్రయోజనాల కోసం ధాన్యం కొనుగోలు సమస్య ను పక్కదారి పట్టించారని విమర్శించారు.

Read Also: హక్కుల కోసం ఉద్యమిస్తే అరెస్టులా..?: అచ్చెన్నాయుడు

స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని గతంలో ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇచ్చింది.126 జీవో ద్వారా ఉద్యోగాల భర్తీ, బదీలీలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం 317 జీవోను తెచ్చి ఉద్యోగ ఉపాధ్యాయులకు అన్యాయం చేసిందని ఆయన మండిపడ్డారు. బండి, గుండు అంటూ విమర్శలు పక్కన బెట్టి తలుచుకుంటే కేంద్ర ప్రభుత్వమే ఈ జీవోను రద్దు చేయవచ్చని తెలిపారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ జీవో రద్దు చేస్తామని బీజేపీ రాజకీయ డ్రామాకు తెరలేపిందన్నారు. ఈ సమస్యలు అన్ని పోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Exit mobile version