NTV Telugu Site icon

Revanth Reddy: నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు.. అసలు ఆ ప్రస్తావన తేలేదు

Revanthreddy Kcr

Revanthreddy Kcr

Revanth Reddy: కాంగ్రెస్‌ పార్టీలో పెద్ద రెడ్లు కేసీఆర్ కు అమ్ముడు పోయారంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. సీనియర్ల పై నేను చేసిన వ్యాఖ్యలు అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అసలు ఆ ప్రస్తావన తేలేదని టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వార్తల్లన్నీ వాళ్ళు అన్వయించుకున్నవే అని మండిపడ్డారు. కాంగ్రెస్ లో సీనియర్లు అమ్ముడుపోయారని ఓ పత్రిక తప్పుడు వార్తలు రాసింది. నేను సీనియర్లపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. నేను అనని వాటిని అన్నట్లుగా రాయడం సరైంది కాదన్నారు. మీడియా సంయమనం పాటించాలన్నారు. అలాంటి వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నా అని అన్నారు రేవంత్. రాజకీయ వివాదాలు సృష్టించి సమస్యలు జఠిలం చేయొద్దని సూచించారు. నిజమాబాద్ జిల్లా మంచిప్ప రిజర్వాయర్ పరిశీలించిన రేవంత్ రెడ్డి తను సీయర్లపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.

జలయజ్ఞంలో భాగంగా కాంగ్రెస్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టిందని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ పేరు పెట్టి వారి గొప్పదనాన్ని చెప్పాలనుకున్నామన్నారు. 900 కోట్ల పైగా ఖర్చు చేసి 75 శాతం పనులు పూర్తి చేశామన్నారు. కొండెం చెరువు కెపాసిటీ 0.84 టీఎంసీ వుందన్నారు. ఈ ప్రాంతంలో పేదల భూములు ముంపుకు గురవుతాయని ఉన్నదాంట్లోనే లక్ష 83వేల ఎకరాకు నీరివ్వాలనుకుందని స్పష్టం చేశారు. ఇంకో 300కోట్లు ఖర్చుగ చేస్తే ఈ ప్రాంతానికి సాగు నీరు అందేదన్నారు. కేసీఆర్ హయాంలో ఆయన స్వార్ధానికి ఈ ప్రాజెక్టు బలైందని అన్నారు. ఆయన అవినీతికి ఈ ప్రాజెక్ట్ ఒక ఉదాహరణ అన్నారు. రూ.3500 కోట్లకు ప్రాజెక్టు అంచనా వ్యయం పెంచారన్నారు. భూసేకరణతో 10 గ్రామాలు ముంపుకు గురవుతున్నాయన్నారు.

ఆయకట్టు పెరగక పోయినా ఇక్కడి పేదలను భూ నిర్వాసితులను చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 300 కోట్లకు పూర్తి కావాల్సిన ప్రాజెక్టును 3500 కోట్లకు పెంచారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో లాగానే కేసీఆర్ పాలనలో అదే వివక్ష కొనసాగుతోందన్నారు. భూములు కోల్పోయిన రైతులు నిరసన తెలిపితే 307 కేసులు పెట్టారన్నారు. 17మంది ని అరెస్ట్ చేసి జైలుకు పంపారని తెలిపారు. వారిపై కేసులను బే షరతుగా ఉపసంహరించుకుని విడుదల చేయాలన్నారు. తొమ్మిదేళ్లయినా 21వ ప్యాకేజీ పనులు పూర్తి కాలేదని తెలిపారు. కేసీఆర్ ది దుర్మార్గమైన చర్య అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టును పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్‌ చేశారు. భూ నిర్వాసితుల పోరాటానికి కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. రీడిజైన్ ను వెనక్కు తీసుకుని.. పాత డిజైన్ ప్రకారం ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్‌ చేశారు రేవంత్‌ రెడ్డి.
Revanth Reddy: రేవంత్ కీలక వ్యాఖ్యలు.. కాంగ్రెస్ లోని పెద్ద రెడ్లు ఆ పార్టీకి అమ్ముడు పోయారు..