Revanth Reddy vs Harish Rao: తొమ్మిదిన్నరేళ్ల సాగునీటి శాఖ కేసీఆర్ కుటుంబం ఆధీనంలోనే ఉంది.. ప్రజల్ని మభ్యపెట్టడానికి కేసీఆర్ కుటుంబం ప్రయత్నం చేస్తోంది.. సభను హరీశ్‌రావు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.. కాళేశ్వరం అద్భుతం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.. ప్రాజెక్టుకు ఎంత ఖర్చుచేశారు, ఎన్ని రుణాలు తీసుకున్నారన్న వివరాలు బయటకు తీస్తాం.. కార్పొరేషన్ల అప్పులకు సంతకాలు పెట్టింది ఎవరు?.. మీరొచ్చాక శివుడి తలపై ఉన్న గంగను భూమికి తెచ్చి కాళేశ్వరానికి పారించారా? అని ప్రశ్నించారు. హరీష్ అబద్ధాలు చెప్పి..ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. సభను తప్పుదోవ పట్టించే వాళ్ళు ఆధారాలు లేకుండా చెప్తే.. చర్యలకు దిగండి అని తెలిపారు. ఎలాంటి చర్యలు ఉంటాయో.. శాసన సభ వ్యవహారాల మంత్రి ఆలోచన చేయాలన్నారు.
భగీరథ.. కాళేశ్వరం నీళ్లను అమ్ముకుంటాం అని చెప్పి అప్పు తెచ్చింది మీరు అంటూ మండిపడ్డారు. టీఎస్ఐఐసీ అప్పు ప్రభుత్వం కట్టలేదా ? అని ప్రశ్నించారు. శ్వేతపత్రం పేజీ నెంబర్ 21 చూసుకోవాలన్నారు. కాళేశ్వరం కోసమే 80 వేల కోట్ల రుణం తీసుకున్నారని తెలిపారు. ఇవి కాకుండా ఖర్చు ప్రభుత్వం కొన్ని నిధులు ఖర్చు పెట్టిందన్నారు. కాళేశ్వరం అద్భుతం అని హరీశ్‌రావు సభను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. హరీశ్‌రావు చెప్పేవన్నీ అబద్ధాలు అన్నారు. కాళేశ్వరంపై వచ్చే ఆదాయంతో అప్పులు చెల్లిస్తామని చూపించారని, ఇలా చెప్పే అప్పులు తీసుకువచ్చారని అన్నారు. మిషన్ భగీరథ తర్వాతనే నీళ్లు తాగామా ? 2014కు ముందు ఎవరూ నీళ్లు తాగలేదా ? అన్నారు. మిషన్ భగీరథ ద్వారా కూడా డబ్బులు సంపాదిస్తామని చూపించారని తెలిపారు. ఆదాయంతోనే అప్పులు చెల్లిస్తామని బ్యాంకులకు తప్పుడు నివేదికలు ఇచ్చారని తెలిపారు.
Read also: Pawan Kalyan: తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్!
హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రాజెక్టులు…ప్రగతి భవన్ పై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ప్రగతిభన్ లో 150 గజాలు ఉన్నాయి అని…బుల్లెట్ ప్రూఫ్ గదులు ఉన్నాయి అని కాంగ్రెస్ అందన్నారు. భట్టి విక్రమార్క ప్రగతి భవన్ లో ఉంటున్నారని తెలిపారు. భట్టి విక్రమార్క చెప్పాలి…ప్రగతి భవన్ లో ఏమి ఉన్నాయో ? ఎన్ని గదులు ఉన్నాయో? అని ప్రశ్నించారు. ప్రాజెక్ట్ లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి అని డిమాండ్ చేస్తున్న అన్నారు. మేము రెడీగా ఉన్నాము…ఎటువంటి విచారణకు అయిన సిద్ధమని హరీష్ రావు అన్నారు. కాగా.. ఇంతలోనే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు కి మైక్ ఇవ్వాలని వెల్ లోకి వచ్చారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.
Harish Rao: శ్వేత పత్రం కక్ష సాధింపు లెక్క.. అది తప్పుల తడక