CM Revanth Reddy : ఎనిమిదేళ్లు ఇందిరమ్మ రాజ్యమే.. వికారాబాద్‌ను ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుస్తాం
- వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
- నారాయణపూర్‌లో ప్రజాపాలన-ప్రగతిబాట బహిరంగ సభ
- స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కుల పంపిణీ
- రెండేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం
- గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం -సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా నారాయణపూర్‌లో నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతిబాట బహిరంగ సభ పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి చెక్కుల పంపిణీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను, తప్పులను సరిదిద్దుకుంటూ తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి కోసం ముందుకు వెళుతోందని ఆయన స్పష్టం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్, కేంద్రంలో పన్నెండేళ్లుగా ఉన్న మోదీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించిన ఆయన, బీజేపీ , బీఆర్ఎస్ పార్టీల మధ్య ‘చీకటి ఒప్పందాలు’ ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ కార్యకర్తలు తమ బీ-ఫామ్‌లను బీఆర్ఎస్ ఆఫీసుల నుండి తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేస్తూ, గల్లీలో పనిచేసే నాయకుడిని చూసి కాకుండా ఢిల్లీలో ఉండే పెళ్లి పెద్దను చూసి ఓట్లు వేయడం ఏమిటని ప్రజలను ప్రశ్నించారు.
T20 World Cup Records: వరల్డ్‌కప్‌లో విజయవంతమైన ఛేజ్.. ఎలైట్ లిస్ట్‌లో పాకిస్థాన్‌కు చోటు!
Also Read
- CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
- Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
- KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
- Hyderabad: "కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు".. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంజూరైన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ తన స్వార్థం కోసం అటకెక్కించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాకు 3 టీఎంసీల గోదావరి జలాలను అందిస్తే లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చేవేనని, కానీ కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల జిల్లా రైతాంగం బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ లక్ష కోట్లు వెచ్చించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడు ఏళ్లలోనే ‘కూలేశ్వరం’గా మారిందని, ఆ ప్రాజెక్టు నిధులతో ఆయన కుటుంబ సభ్యులు ఫామ్ హౌసులు కట్టుకుని వ్యాపారాలు చేసుకున్నారని ఆరోపించారు. తాండూరు, పరిగి , వికారాబాద్ ప్రాంతాలను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
జిల్లా అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి పలు కీలక ప్రకటనలు చేశారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ భూసేకరణను త్వరలోనే పూర్తి చేసి, ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. మక్తల్, నారాయణపేట , కొడంగల్ నియోజకవర్గాలకు కృష్ణా జలాలను తరలించి 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పా జంక్షన్ నుండి మన్నెగూడ రోడ్డు పూర్తి కాకపోవడం వల్ల జరిగిన ప్రాణనష్టానికి కేసీఆర్, సబితా ఇంద్రారెడ్డిలే బాధ్యులని విమర్శించిన రేవంత్ రెడ్డి, ప్రస్తుతం కోర్టు కేసులను పరిష్కరించి ఆ రోడ్డు పనులను వేగవంతం చేశామని వెల్లడించారు. భవిష్యత్తులో రీజనల్ రింగ్ రోడ్డు , రేడియల్ రోడ్లు రాబోతున్నాయని, వికారాబాద్ త్వరలోనే ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ చరిత్రను తాను చెరిపేయాలని చూస్తున్నానని కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ దొంగ పాస్‌పోర్టుల చరిత్ర, దొంగ నోట్ల వ్యవహారం , దళితుడిని సీఎం చేస్తానన్న దొంగ హామీల చరిత్ర తెలంగాణ ఉన్నంత కాలం చెరిగిపోదని, ఆ ‘పాపాల భైరవుడి’ చరిత్ర ప్రజలకు గుర్తుండేలా చేసే బాధ్యత తనదని ఆయన వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ లాంటి చిల్లర పనులకు నోటీసులు ఇవ్వక ఏం చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికే 70 వేల ఉద్యోగాల భర్తీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ వంటి హామీలను అమలు చేశామని గుర్తు చేస్తూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విషం చిమ్మే పాములకు మళ్ళీ పాలు పోయకుండా కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
Surender Reddy-Pawan Kalyan: పవన్ కళ్యాణ్-సురేందర్ రెడ్డి మూవీ.. హీరోయిన్ ఎవరు?
తాజావార్తలు
-
Mobile Recharge: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 30-రోజుల రీచార్జ్ ప్లాన్స్..
-
Srikanth Odela: ‘మగధీర’లో గుర్రానికి లేని లాజిక్.. ‘ది ప్యారడైజ్’లో కుక్కకు వచ్చిందా? ట్రోలర్లకు ఇచ్చిపడేసిన శ్రీకాంత్!
-
Promotions: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆ ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్..
-
Brave Head Constable: తమిళనాడులో రెచ్చిపోయిన గుట్కా ముఠాలు.. సినిమా రేంజిలో ఛేజింగ్..
-
CM Revanth Reddy : శ్వేతపత్రం విడుదల చేశాకే సిరిసిల్లలో అడుగుపెట్టాలి
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?