Revanth Reddy: బీజేపీ.. జనసేనతో పాటూ కేఏపాల్ ను కూడా కలుపుకుంటే బాగుండు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: బీజేపీ.. జనసేనతో పాటూ కేఏపాల్ ను కూడా కలుపుకుంటే బాగుండని టీపీసీసీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లోని ఎఐసిసి కార్యాలయం లో టి కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ల మాట్లాడారు. ఈనేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్న ఎన్నికల కమిషన్ ను కలిశామన్నారు. నోటిఫికేషన్ లోపల నగదు బదిలీలు పూర్తి చెయ్యాలని కోరామన్నారు. రిటైర్డ్ అధికారులను.. కొనసాగిస్తూ అధికార దుర్వినియోగాన్ని కి ప్లాపడుతున్నారు వెంటనే తొలగించాలని అన్నారు. ప్రయివేట్ అర్మిలా కేసీఆర్ ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. నిజాం దగ్గర రజాకార్ల లాగా.. కేసీఆర్ వద్ద ఈ అధికారులు రజాకార్ల లా పనిచేస్తున్నారని అన్నారు. అధికారులు బీఆర్ఎస్ ఎన్నికల నిర్వహణ చేస్తున్నారని మండిపడ్డారు. అంజనీ కుమార్, స్టీఫెన్ రవీంద్ర లను బదిలీ చెయ్యాలని కోరామని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమేష్ కుమార్, స్మితా సబర్వాల్, జయేష్ రంజన్ లు బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు. రైతు బంధు, దళిత బంధు, బిసి బంధు, కళ్యాణ లక్ష్మి, శాది ముభారక్ నిధులు నవంబర్ 2 లోపు విడుదల చెయ్యాలని కోరారు. లబ్ధిదారులకు ఏ నిధులు పెండింగ్ లో పెట్టినా.. మా ప్రభుత్వం వచ్చాక మా హామీ మేరకు డబుల్ నిధులు వస్తాయన్నారు.
కేసీఆర్ ఏం చెప్పినా అమలు చెయ్యరన్నారు. కాంగ్రెస్ పై విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఎందుకు భూమిలోకి కుంగింది? అని ప్రశ్నించారు. ఆ ప్రాజెక్ట్ వద్ద బొగ్గు నిక్షేపాలు ఉంటాయన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణ నాణ్యత లోపం అన్నారు. సాయిల్ టెస్ట్ వంటి జాగ్రత్తలు పడలేదున్నారు. గాల్లో మేడలా మెడిగడ్డ ప్రాజెక్ట్ ను నిర్మించారని ఆరోపించారు. మావోయిస్టుల మీద, సంఘ విద్రోహ శక్తులు చేశారని ప్రచారం మొదలు పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ జైలు కు వెళ్ళే పరిస్థితి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్యాం సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. నివేదిక బయట పెట్టాలన్నారు. బీఆర్ఎస్ ను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని Enc మురళిధర రావు ఎప్పుడో రిటైర్ అయ్యారని గుర్తు చేశారు. ఆయన ఇపుడు కేసీఆర్ కోసం పనిచేస్తున్నారని తెలిపారు. ఇసుక కొట్టుకు పోతే డ్యాం కుంగింధి అంటే, ఎంత నాణ్యత లోపం ఉందో స్పష్టంగా తెలుస్తుందన్నారు. కేసీఆర్ అక్రమ సంపాదనలో కేంద్రానికి కప్పం కడుతున్నారని అన్నారు. అందుకే కేంద్రం కేసీఆర్ ను కాపాడుతోందన్నారు. ఎన్నికల అధికారులకు పిర్యాదు చేయడం ప్రాసెస్ అన్నారు.
Also Read
- LPG: వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. ఆగస్టు 23 వరకు ఛాన్స్..
- CM Revanth Reddy: టీజీ సేఫ్ అమల్లోకి తెచ్చామన్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ప్రారంభమైన కొత్త అథారిటీ..
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
- SIR Draft Voter List: తెలంగాణలో నేడు ముసాయిదా ఓటర్ జాబితా విడుదల.. 73.39 లక్షల పేర్ల తొలగింపు.!
అధికారులు తీసుకునే చర్యలను బట్టి మా తదుపరి కార్యాచరణ ఉంటుందన్నారు. కేసీఆర్, హరీష్, కెటిఆర్ లు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పరని తెలిపారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఉంది . అందుకే అక్కడ ఎటువంటి దాడులు ఉండవన్నారు. ఎన్నికలు ఉండే రాష్ట్రాలకు ఈడి, సిబిఐ లు ముందు వెళ్తాయన్నారు. కాంగ్రెస్ ను వీడిన నాయకులు బీజేపీ సిద్దాంతాలు నమ్మి పోలేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. కేసీఆర్ పై చర్యలు తీసుకుంటుంది అని నమ్మారన్నారు. అది అక్కడ సాధ్యం కాదని నమ్మి వెనక్కి వస్తున్నారని తెలిపారు. రాజ్ గోపాల్ రెడ్డి, డి.కె అరుణ, విజయశాంతి, విశ్వేశ్వర్ రెడ్డిలు సిద్దాంతాలు నమ్మి బిజెపిలో చేరలేదని స్పష్టం చేశారు. బీజేపీ.. జనసేనతో పాటూ కే.ఏ.పాల్ ను కూడా కలుపుకుంటే బాగుండని వ్యంగాస్త్రం వేశారు. కొడంగల్ లో పోటీ చేద్దామని కేసీఅర్ ను కొర్తున్నానని అన్నారు. పార్టీ ఆదేశిస్తే రేవంత్, భట్టి ఎక్కడయినా పోటీ చేస్తాం, కేసీఆర్, కెటిఆర్ లను చిత్తు చిత్తుగా ఒడిస్తామన్నారు.
BS Yeddyurappa Security: మాజీ సీఎంకు Z+ సెక్యురిటీ.. భద్రతను పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందంటే?
తాజావార్తలు
-
LPG: వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. ఆగస్టు 23 వరకు ఛాన్స్..
-
BJP: యూపీ ఎన్నికల ముందు బీజేపీలో పదవుల జాతర.. పురందేశ్వరికి కీలక పదవి
-
Korean Kanakaraju: సైలెంటుగా 50 కోట్లు కొట్టిన కొరియన్ కనకరాజు
-
Suriya Vs Lokesh: లోకేష్ కనగరాజ్’కు సూర్య మార్క్ షాక్?
-
Deputy CM Pawan Kalyan: తొలి విమానం ల్యాండింగ్.. ఉత్తరాంధ్ర ప్రగతికి కొత్త అధ్యాయంగా అభివర్ణించిన పవన్
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!