Revanth Reddy: తండ్రీకొడుకులకు జనం మధ్య తిరిగే పరిస్థితి లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy Satires On Minister KTR and CM KCR: సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనను వీఆర్ఏలు అడ్డుకోవడం, అలాగే భద్రాచలంలో వరద బాధితుల నుంచి సీఎం కేసీఆర్‌కు నిరసన ఎదురైన ఉదంతాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. కేటీఆర్‌ను ట్విటర్ పిట్టగా అభివర్ణించిన ఆయన.. నిన్న మెట్పల్లిలో చెరుకు రైతుల సెగ, ఇవాళ సిరిసిల్లలో వీఆర్ఏల సెగ తగిలిందని అన్నారు. అటు.. భద్రాచలంలో వరద బాధితుల నుంచి కేసీఆర్‌కు నిరసన ఎదురైందని వెల్లడించారు. ఇప్పుడు తండ్రీకొడుకులకు జనం మధ్యం స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని, బంగారు తెలంగాణ క్షేత్రంలో ఇదే వాస్తవ పరిస్థితి అని రేవంత్ వివరించారు.
కాగా.. గత రెండు రోజుల నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు నిరసనలు తెలియజేస్తున్నారు. ఓ సమీక్ష నిమిత్తం మంత్రి కేటీఆర్ ఈరోజు (23-07-22) కలెక్టరేట్‌కు వచ్చారు. సమీక్ష అనంతరం కేటీఆర్ కాన్వాయ్ కలెక్టరేట్ నుంచి బయటికి వెళ్తుండగా..50 మంది వీఆర్ఏలు ఒక్కసారిగా దూసుకొచ్చారు. తమను విధుల్లోకి తీసుకోవాలని, అలాగే పేస్కేల్ పదోన్నతులు కల్పించాలని నినాదాలు చేశారు. కేటీఆర్ కాన్వాయ్ ముందు బైఠాయించే ప్రయత్నమూ చేశారు. ఈ క్రమంలోనే ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి, పరిస్థితిని అదుపు చేశారు. కొందరు వీఆర్ఏలను అరెస్ట్ చేశారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!