Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Kamareddy Revanth Reddy Satire On Minister Ktr And Cm Kcr

Revanth Reddy: అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు.. ఇప్పుడు ప్రశ్నాపత్రాల కొనుగోలు

Published Date :March 19, 2023 , 2:28 pm
By NTV WebDesk
Revanth Reddy: అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు.. ఇప్పుడు ప్రశ్నాపత్రాల కొనుగోలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Revanth Reddy: అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు.. ఇప్పుడు ప్రశ్నాపత్రాల కొనుగోలు.. అక్కడ కేసీఆర్.. ఇక్కడ కేటీఆర్ పాత్రదారులంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి. నిరుద్యోగుల పాలిట రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద సమస్యగా మారిందని మండిపడ్డారు. పేపర్ లీకేజీలతో పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ తప్పిదాలకు ప్రభుత్వాన్నే రద్దు చేయాల్సిన పరిస్థితులు దాపురించాయన్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు.కేటీఆర్ తనకేం సంబంధం అని అతి తెలివిగా ప్రశ్నిస్తున్నారు. పేపర్ లీక్ వ్యవహారంలో అరెస్ట్ చేసిన వారిని కస్టడీలోకి తీసుకుని వివరాలు ఎందుకు సేకరించలేదు? చంచల్ గూడ జైలుకు వెళ్లి కొందరు.. వారిని ఎం కౌంటర్ చేస్తామని బెదిరించి లొంగదీసుకున్నారు? అందుకే కేటీఆర్ ప్రెస్ మీట్ అయ్యాకనే వారిని కస్టడీలోకి తీసుకున్నారని ఆరోపించారు. ఈ నెల 13 నుంచి 18 వరకు చంచల్ గూడ జైలు సందర్శకుల వివరాలు, సీసీ ఫుటేజ్ బయటపెట్టాలని, కేటీఆర్ ఏమైనా విచారణ అధికారా? టీఎస్ పీఎస్సీ లో పనిచేసే వారు పోటీ పరీక్షలు రాయడానికి అర్హత లేదు. కానీ ప్రభుత్వం పరీక్షలు రాసుకోవడానికి ఎన్ఓసీ ఇచ్చింది..నిబంధనలకు విరుద్ధంగా 20 మందికి పైగా పోటీ పరీక్షలు రాశారన్నారు. మాధురి అమెరికా నుంచి వచ్చి గ్రూప్1 రాస్తే మొదటి ర్యాంక్ వచ్చింది.

Read also: Revanth Reddy: విచారణ చేయకముందే ఇద్దరు మాత్రమే బాద్యులని కేటీఆర్ ఎలా చెపుతారు?

జూనియర్ అసిస్టెంట్ రజినీకాంత్ రెడ్డికి 4వ ర్యాంక్ వచ్చింది. Tspsc ద్వారా రాజశేఖర్ రెడ్డికి ఉద్యోగం,ప్రమోషన్ వివరాలు ప్రభుత్వం బయటపెట్టాలి. లీకేజీ వ్యవహారంలో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మీ పాత్ర ఉందొ లేదో విచారణ చేపట్టాలి. ఈ విషయం కేటీఆర్ కు తెలుసా లేదా?అని ప్రశ్నించారు. ఒక మంత్రి పేషీలో మంత్రికి తెలియకుండా ఇదంతా జరగదని, కేటీఆర్ మంత్రి కార్యాలయమే అన్ని వ్యవహారాలను చక్కదిద్దిందని.. ఈ ఆరోపణల నుంచి మంత్రి కేటీఆర్ తప్పించుకోలేరని రేవంత్‌ మండిపడ్డారు. 2016 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని పరీక్షలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇంత తీవ్రమైన సమస్యపై సీఎం స్పందించి నిరుద్యోగులకు భరోసా ఎందుకు ఇవ్వలేదన్నారు. నిరుద్యోగులపట్ల సీఎంకు ఇంత బాధ్యతారాహిత్యమా? కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల, ఏఆర్ శ్రీనివాస్ కు ఉన్న బంధమేంటి? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సిట్ కు అప్పగించిన ఏ కేసు ముందుకు సాగలేదు? పేపర్ లీకేజీ కేసును సీబీఐకి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు.. ఇప్పుడు ప్రశ్నాపత్రాల కొనుగోలు.. అక్కడ కేసీఆర్.. ఇక్కడ కేటీఆర్ పాత్రదారులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంపై హైకోర్టులో రేపు వాదనలు వినిపిస్తామన్నారు. 21న గవర్నర్ ను కలిసి పిర్యాదు చేసి.. తక్షణమే వారిని ప్రాసిక్యూట్ చేయాలని కోరతామన్నారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు పిలుపునిస్తున్నా..కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేద్దాం.. తండ్రీ కొడుకులను చంచల్ గూడ జైలుకు పంపిద్దామని రేవంత్‌ సంచలన వ్యాఖ్యాలు చేశారు.
Vemula Prashanth Reddy: రేవంత్ రెడ్డివి దొంగ మాటలు.. తనతో ఉన్నవాళ్లు కూడా దొంగలు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cm kcr
  • revanth reddy
  • Revanth Reddy satire
  • satire on Minister KTR
  • Tspsc paper leaked

తాజావార్తలు

  • LPG Gas: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై మరో బిగ్ అప్‌డేట్..

  • Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..

  • Dacoit: ‘డెకాయిట్’ సెన్సార్ రివ్యూ

  • Mushroom Curry Recipe: చికెన్ కర్రీ ఎందుకు..? మష్రూమ్ కర్రీ ఉండగా.. సూపర్ సాఫ్ట్ గా చేసేయండి ఇలా..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

ట్రెండింగ్‌

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!

  • 50MP సోని కెమెరా, 68W ఫాస్ట్ ఛార్జింగ్ తో Moto G Stylus (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions