Site icon NTV Telugu

నీళ్లు, నిధుల పేరుతో కేసీఆర్ కోట్ల అవినీతికి పాల్పడ్డారు: రేవంత్‌రెడ్డి

నీళ్లు, నిధులపేరుతో కేసీఆర్‌ కోట్ల అవినీతికి పాల్పడ్డారని, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్‌ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. భవిష్యత్‌లో ఇంకా చాలా శిక్షణా తరగ తులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సోనియా గాం ధీ ఆమోదిస్తే వచ్చే ఏడాది ఏఐసీసీ ఫ్లీనరీ సమావేశాలను హైదరాబా ద్‌లో నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీపై నిప్పులు చెరిగారు. కేసీఆర్,బండి సంజ య్‌ల ప్రెస్‌మీట్‌లు చిక్కడపల్లి కౌంపౌండ్‌ను తలపిస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. బండి సంజయ్‌ను కేసీఆర్ 6 ముక్కలు చేస్తా అన్నా..అరవింద్, బండి సంజయ్ ఎందుకు నోరు విప్పడం లేద న్నారు. కాంగ్రెస్ పార్టీ చర్చలో లేకుండా ఉండేందుకు బీజేపీ, టీఆర్‌ఎస్‌లు పొలిటికల్‌ డ్రామాలు ఆడుతున్నాయన్నారు.

కేసీఆర్ అవినీతిని బయటపెట్టే ధైర్యం మాకుందని రేవంత్ అన్నారు . అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ బండి సంజయ్‌కు ఇప్పిస్తారా అని ప్రశ్నించారు. మోడీ, అమిత్‌షా లకు చిత్తశుద్ధి ఉంటే కళేశ్వరం, పాల మూరు ప్రాజెక్టులో జరిగిని అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశిం చాల న్నారు. కిషన్ రెడ్డికి నేను సవాల్ చేస్తున్నా ..మీరు సీబీఐ ఎంక్వరీ వేయండి, కేసీఆర్ అవినీతిని నేను నిరూపించకుంటే రాజకీ యాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అని రేవంత్‌ అన్నారు. కేసీ ఆర్ ఇచ్చిన డబ్బులను తమిళనాడు ఎన్నికలకు కిషన్ రెడ్డి తరలిం చాడు. తమిళనాడు లో బీజేపీ ఎన్నికల ఖర్చు కేసీఆర్‌ పెట్టు కున్నా డు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగిని మరోసారి చేసేం దుకు కేసీఆర్ మోడీతో ఒప్పందం చేసుకున్నారు. అక్కడ mim చేత వంద సీట్లకు పోటీ చేయించి ప్రతిపక్ష ఓట్లను చీల్చి బీజేపీ మళ్ళీ అధికా రంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారన్నారు. పవర్ ప్రాజెక్టులలో కేసీఆర్ వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడ్డాడని అన్నారు.


గచ్చిబౌలి, నార్సింగి లలో వేల కోట్ల రూపాయల భూములను పప్పు,బెల్లం లా కేసీఆర్ తన మనుషులకు కట్టబెట్టాడని రేవంత్ ఆరోపించారు. పవర్ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని బీజేపీ మాజీ అధ్య క్షుడు లక్ష్మణ్ ఆరోపించినప్పుడు..నేను ఆధారాలు ఇస్తా అని చెప్పి నా.. ఇప్పుడు బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ ఎందుకు విచారణ కోరడం లేదన్నారు. నెక్లెస్ రోడ్‌లో ఉన్న సంజీవ య్య పార్క్‌ను మంత్రి తలసాని ఆక్రమించాడు. విచారణకు ఆదేశించే ధైర్యం బీజేపీకి ఉందా…? అని ప్రశ్నించారు. అమరుల త్యాగాల మీద ఏర్పడిన తెలంగాణ లో అధికారం చెలాయిస్తున్న కేసీఆర్ ..ఏనాడైనా అమరుల కుటుంబాలను పట్టించుకున్నారా అంటూ విమర్శించారు. ట్యాంక్ బండ్ పై నిర్మిస్తున్న అమరవీరుల స్థూపంలో కూడా అవినీతికి పాల్పడ్డారన్నారు.గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతం చేయండి. సోనియా గాంధీ మీద ఓటేసి చెప్తున్నా. .కుర్చిలో ఏవరైనా కూర్చోనీ యండి కానీ ఈ పోరాటం మాత్రం ఆగదని రేవంత్‌రెడ్డి అన్నారు.

Exit mobile version