CM Revanth Reddy: ఎవరు చేసారో తెలుసుకోండి.. కానిస్టేబుల్ మృతిపై సీఎం సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో ఓ కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కాగా..వణ్య ప్రాణాల కోసం ఏర్పాటు చేసిన కరెంట్ వైర్లు తగిలి విధి నిర్వహణలో ఉండగానే కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కాటారం మండల పరిధిలోని నస్తూర్‌పల్లిలో చోటుచేసుకుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఏం జరిగిందో తెలుసుకోవాలని పై అధికారులకు విచారణ ఆదేశించారు. కరెంట్ తీగలు ఎవరు అమర్చారో తెలుసుకునే పనిలో దర్యాప్తు చేస్తున్నారు.
Read also: Karnataka: రైతును పెళ్లి చేసుకునే అమ్మాయికి రూ. 5 లక్షలు..
Also Read
- TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
- Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
- AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో 'ఏఐ' విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
- JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
నస్తూర్‌పల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తున్నట్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందింది. కానిస్టేబుల్ ప్రవీణ్ మరికొందరు సిబ్బందితో కలిసి అడవిలో కూబింగ్ కు వెళ్లాడు. ఈ క్రమంలో వన్యప్రాణులను వేటాడేందుకు ఏర్పాటు చేసిన కరెంట్ వైర్లు తగిలి ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి కరెంట్ షాక్ ట్రాప్ వేసిన నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. కానిస్టేబుల్ మృతి విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు పోవడం విచారకరమని తెలిపారు. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కరెంట్ వైర్లు వేసిన దుండగులను పట్టుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
Tamil Nadu: తమిళనాడులో అసెంబ్లీలో ప్రభుత్వ ప్రసంగాన్ని నిరాకరించిన గవర్నర్
తాజావార్తలు
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!