NTV Telugu Site icon

Revanth Reddy: మంత్రి పువ్వాడకు రేవంత్‌రెడ్డి చాలెంజ్.. నువ్వే సీబీఐకి లేఖ రాయి..

ఖమ్మం పర్యటనలో మంత్రి పువ్వాడ అజయ్‌ను టార్గెట్‌ చేశారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఈ మధ్య అక్కడ జరిగిన ఘటనల్లో మంత్రిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే కాగా.. అజయ్‌పై సీబీఐ విచారణకు డిమాండ్‌ చేశారు రేవంత్.. సీబీఐ విచారణకు నువ్వే లేఖ రాయి అంటూ పువ్వాడ అజయ్‌కు సవాల్‌ విసిరారు.. కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు.. అలాంటి సైకోకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే మాడి మసైపోతావ్‌ అంటూ హెచ్చరించారు రేవంత్‌రెడ్డి.. కమ్మ కులాన్ని అడ్డం పెట్టుకొని అజయ్‌ బతుకుతున్నాడు.. ఇలాంటి వ్యక్తిని రాజకీయాల నుండి బయటికి గెంటాలి.. వచ్చే ఎన్నికల్లో పువ్వాడ అజయ్‌ని బహిష్కరించండి అంటూ పిలుపునిచ్చారు.

Read Also: Prashant Kishor: కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చిన పీకే.. నా వల్ల కాదు..!

ఖమ్మం జిల్లాలో నమోదైన పీడీ యాక్ట్‌ కేసులు, చనిపోయిన కార్యకర్తలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసిన రేవంత్‌రెడ్డి.. సీబీఐ విచారణకు నువ్వు లేఖ రాయి అంటూ మంత్రికి సవాల్‌ విసిరారు.. కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కు కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. రోజులు లెక్కపెట్టుకోండి.. పువ్వాడ పతానానికి 365 రోజులే ఉంది.. డైరీలో రాసుకోండి అని కామెంట్‌ చేసిన పీసీసీ చీఫ్‌.. అధికారులు 365 రోజులు అయినా మానవత్వంతో చట్టాన్ని అమలు చేయాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అధికారులను హెచ్చరించారు. ఇక, చనిపోయిన రైతు కుంటుంబాలకు కాంగెస్ పార్టీ అండంగా ఉంటుందన్న రేవంత్‌రెడ్డి.. రైతులు పండించిన మిర్చికి గిట్టుబాటు ధరలేక పోతే రైతులకు బేడీలు వేయించిన ఘనత కేసీఆర్‌ది అని మండిపడ్డారు.. మే 6న వరంగల్‌లో రాహుల్ గాంధీ సభ జరుగుతోంది.. కేసీఆర్‌ చేసిన మోసంపై పోరాటానికి రైతు సంఘర్షణ సభ నిర్వహిస్తున్నామని.. పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.