TPCC Revanth Reddy Meeting With NSUI Leaders.
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఎన్‌ఎస్‌యూఐ నేతలతో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సిరిసిల్ల సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. పిల్లలకు ఉద్యోగాలు రాకపోతే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో ఆ బాధ కేసీఆర్ కు తెలవాలని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే మన బాధ కేసీఆర్ కు తెలుస్తుందని, ఆ బాధ కేసీఆర్ కు తెలియాలంటే మీరంత చాలా కష్టపడి పని చేయాలన్నారు. చిన్నన్న ఎన్నికలలో పోటీ చేసినపుడు నేనే వాల్ రైటింగ్ చేసానని, 2004 వరకు వనపర్తి ఎన్నికలలో నేనే చిన్నన్న కోసం పని చేసానన్నారు. నేను ఈ రోజు పీసీసీ అధ్యక్షుడిని ఆయన నా దగ్గర కూర్చున్నారు. చిన్నన్న పనితనం చూసి నేర్చుకోవాలి.క్రైసెస్ లోనే లీడర్లు ఏడుగుతారు.
2009 లోనే మనిక్కమ్ ఠాగూర్ వైగో లాంటి పెద్ద ఉద్యమకారుడిని ఓడించారు. విద్యార్థి ఉద్యమాలు చేసే వారికి రాజకీయాలలో మంచి భవిష్యత్ ఉంటుంది. నేను పీసీసీ అధ్యక్షులుగా మొదటి బ్.ఫామ్ వెంకట్ కు ఇచ్చాను. విద్యార్థి ఉద్యమాలలో కీలకంగా ఉన్న నాయకులు భవిష్యత్తు లో ఎదుగుతారు. కాలేజ్ లెవల్ లో కమిటీలు వేసుకోవాలి.. అప్పుడే సంస్థలు బలపడతాయి. విద్యార్థి ఉద్యమకారులను తప్పకుండా నేను మద్దతు ఇస్తాను. మెరిట్ కే కోటా.. మీరు పని చేస్తే టికెట్స్ ఇంటికి వస్తాయి.