తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి. చాలా చోట్ల వడ్లు కల్లాల్లో ఉండగా… వర్షాల వల్ల తడిసి పోయాయి. కనీసం వడ్లపై కప్పేందుకు టార్పలిన్ కవర్లు లేక రైతుల చాలా నష్టపోతున్నారు. మరోవైపు అకాల వర్షాల వల్ల మామిడి రైతులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులు, వడగండ్ల వల్ల మామిడి పూత రాలింది. అయితే సర్కార్ రైతుల ధాన్యం కొనుగోలు ఆలస్యం చేయడం వల్లే రైతులు నష్టపోతున్నారని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు.
తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా పలు విమర్శలు చేశారు. 16 రోజుల పాటు కేసీఆర్ కుంభకర్ణుడిలా ఫామ్ హౌజ్ లో సేదతీరాడని… రైతేమో కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారని.. ఐకేపీ కేంద్రాల్లో టార్పాలిన్లు గతిలేక రైతుల కష్టం వర్షపు నీటిలో కొట్టుకుపోయిందని.. ఇదే రాక్షసత్వం కేసీఆర్ అంటూ ప్రశ్నించారు. కర్షకులే నీకు కర్రుకాల్చి వాత పెట్టుడు ఖాయం అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు.
కుంభకర్ణుడులా కేసీఆర్ 16 రోజులు ఫాంహౌస్ లో సేదతీరి వచ్చాడు. రైతేమో ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నాడు. ఐకేపీ కేంద్రాలలో టార్పాలిన్ లు గతిలేక రైతు కష్టం వర్షపునీటిలో కొట్టుకుపోయింది. ఇదేం రాక్షసత్వం కేసీఆర్! కర్షకులే నీకు కర్రుకాల్చి వాత పెట్టుడు ఖాయం.#KCRFailedTelangana pic.twitter.com/3O1fFdIyLb
— Revanth Reddy (@revanth_anumula) May 17, 2022
11 May 2022 న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , కేసీఆర్ సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. వరంగల్ రింగ్ రోడ్డు పేరుతో టీఆరెస్ పార్టీ మరో లూటీకి శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్విట్ చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రియల్ ఎస్టేట్ మాఫియా ద్వారా వరంగల్ రింగ్ రోడ్డు పేరుతో రైతులు సాగు భూములను లాక్కునేందుకు ప్లాన్ వేశారని మండిపడ్డారు.
TRS has started another loot in the name of Warangal Ring Road (WRR)
KCR & KTR through their real estate mafia are hell bent on grabbing fertile cultivable lands from farmers in the name of WRR.They have amassed huge chunks of lands for cheaper prices in this region long ago.
— Revanth Reddy (@revanth_anumula) May 11, 2022
