NTV Telugu Site icon

Revanth Reddy: మీటింగ్ పెడితే కరెంట్ కట్ చేస్తారా.. మీ నరాలు కట్ అవుతాయి.. రేవంత్ వార్నింగ్

Revanthreddy

Revanthreddy

Revanth Reddy: మీటింగ్ పెడితే కరెంట్ కట్ చేశారు.. మీ నరాలు కట్ అవుతాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వాన వస్తె ఇసుక కదిలిందని అధికారులు అంటున్నారని తెలిపారు. ఇసుక మీద కడుతారా..ఇసుక మీద బ్యారేజి కడితే అది కుంగి పోయిందన్నారు. మేడిగడ్డ అనా పైసకు పనికి రాదని మండిపడ్డారు. అన్నారం అక్కరకు రాదన్నారు. దుర్గం చిన్నయ్యకు కబ్జాలు ఆడ పిల్లల కనబడితే అంతే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుర్గం చిన్నయ్య దుర్మార్గం గురించి వాళ్ళే చెప్పుతున్నారని తెలిపారు. అలాంటి వ్యక్తి టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. ఈ జన ప్రవాహాన్నీ చూస్తోంటే గోదావరి నది ఈ మైదానంలో ప్రవాహించినట్లుందని అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించే పేరు కాకా వెంకటస్వామి అన్నారు. దేశంలో గాంధీ కుటుంబంలా తెలంగాణలో వెంకటస్వామి కుటుంబం కాంగ్రెస్ పార్టీకి పట్టాదారులని అన్నారు. ఇటు బెల్లంపల్లిలో అటు చెన్నూరులో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని పిలుపు నిచ్చారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ మెడిగడ్డకు తీసుకెళ్లిండని అన్నారు. మేడిగడ్డ కుంగిపోయింది.. అన్నారం మిగిలిపోయింది. దుర్గం దుర్మార్గాల గురించి రాష్ట్రమే కాదు… దేశమంతా తెలుసన్నారు. అలాంటి దుర్మార్గుడిని గెలిపించాలని కేసీఆర్ చెబుతున్నారని మండిపడ్డారు. చెన్నూరు ఎమ్మెల్యేకు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయి..? అని ప్రశ్నించారు. సింగరేణి ఉద్యోగాలు, భూములు అమ్ముకోలేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అలాంటి వారినా కేసీఆర్ గెలిపించాలనేది. అని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆదిలాబాద్ ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. ఆదిలాబాద్ ఆత్మగౌరవం పెరగాలంటే గడ్డం వినోద్, వివేక్ లను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను ఒక్క కలంపోటుతో తొలగిస్తామన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని కేసీఆర్ అంటున్నారని మండిపడ్డారు. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి తీరుతామన్నారు. ధరణి తీసేస్తే రైతు బంధు రాదని కేసీఆర్ అబద్ధపు ప్రచారం చేస్తుండని అన్నారు. ధరణి రాకముందు 2018లో రైతు బంధు ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. ధరణికంటే మెరుగైన సాంకేతికతను కాంగ్రెస్ తీసుకొస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు భరోసా ద్వారా రైతులకు ప్రతీ ఎకరానికి ఏటా రూ.15వేలు అందిస్తామన్నారు. రైతు కూలీలకు ప్రతీ ఏటా రూ.12వేలు అందిస్తామన్నారు. మాట తప్పని, మడమ తిప్పని ఉక్కు మహిళ సోనియమ్మ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సోనియమ్మ తెలంగాణ ఇచ్చారని తెలిపారు. తెలంగాణ ఇచినట్లే… కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుందన్నారు. కాంగ్రెస్ గెలువుతోనే ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందుతుందని అన్నారు.

Bandi Sanjay: నేను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పను.. బీసీనే సీఎం..