CM Revanth Reddy : అక్రమ మైనింగ్‌పై సీఎం రేవంత్ కీలక నిర్ణయం..
- అక్రమ మైనింగ్‌పై సీఎం రేవంత్ కఠిన హెచ్చరిక
- రాఘవ కన్స్ట్రక్షన్స్‌పై ఇప్పటికే చర్యలు.. భారీ వసూళ్లు
- రాజకీయ పలుకుబడితో తప్పించుకునే అవకాశం లేదన్న సీఎం
- ఖజానాకు రావాల్సిన ప్రతి పైసా వసూలు చేస్తామన్న స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర ఖజానాకు గండి కొడుతూ సాగే అక్రమ మైనింగ్ వ్యవహారాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో అత్యంత కఠినమైన వైఖరిని ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడ గండి పడినా, ఖనిజ సంపద దోపిడీకి గురైనా తాము చూస్తూ ఊరుకోబోమని, అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అంశంపై ముఖ్యమంత్రి సాక్ష్యాధారాలతో సమాధానమిస్తూ, ఇప్పటికే ఆ సంస్థకు నోటీసులు జారీ చేసి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
Akhil Raj: “రాజు వెడ్స్ రాంబాయి” హీరో ఇల్లు ఎలా ఉందో చూశారా?
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు మైనింగ్ శాఖ జరిపిన విచారణలో భాగంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి భారీ మొత్తంలో పన్నులు వసూలు చేసినట్లు ముఖ్యమంత్రి వివరించారు. సినరేజ్ ఛార్జీల కింద రూ. 1,52,97,825, అలాగే పర్మిట్ ఫీజు కింద రూ. 22,25,446 మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఆ సంస్థ నుండి కట్టించుకుందని ఆయన సభకు తెలిపారు. ఎవరైనా మంత్రుల పేర్లు చెప్పుకుని లేదా రాజకీయ పలుకుబడితో పన్నులు ఎగ్గొట్టాలని చూస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఖజానాకు రావాల్సిన ప్రతి పైసాను వసూలు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయడంలో రాజీ పడేది లేదని ఈ సందర్భంగా ఆయన తేల్చి చెప్పారు.
తాజావార్తలు
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
-
Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!