NTV Telugu Site icon

Revanth Reddy: నేడు పొంగులేటి, జూపల్లితో రేవంత్ రెడ్డి కీలక భేటీ

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: జులై 2న ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇతర సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు.ఈ సభకు కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ హాజరుకానున్నారు. ఈ మేరకు సంబంధిత సర్కిళ్ల ద్వారా కార్యక్రమాన్ని ఖరారు చేశారు. అంతకు ముందు ఈ నెల 25న ఢిల్లీలో రాహుల్ గాంధీతో ఈ నేతలిద్దరూ సమావేశమై చర్చిస్తారని, 26న ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించనున్నారని సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అనంతరం జూపల్లిని కూడా కలవనున్నారు. రాహుల్ గాంధీతో సమావేశం, ఖమ్మం బహిరంగ సభపై వారితో చర్చించనున్నారు. గత మూడు నాలుగు రోజులుగా పొంగులేటి, జూపల్లితో బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పొంగులేటి, జూపల్లితో తొలుత బీజేపీ నేతలు చర్చలు జరిపారు. రాష్ట్రంలో అధికార పార్టీని బీజేపీ ఢీకొంటుందని అంచనా వేయడంతో ఈటల రాజేందర్‌తో పలుమార్లు చర్చలు జరిపారు.

Read also: Rashmika: ఈ సినిమాతో నార్త్ లో నేషనల్ క్రష్ సెటిల్ అయిపోవాల్సిందే

అయితే ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరడమే మంచిదన్న అభిప్రాయాన్ని అనుచరులు వ్యక్తం చేయడంతో పాటు కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడంతో పొంగులేటి, జూపల్లిలో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో బలంగా ఉన్న బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ఈ నేతలంతా కలిసి గ్రూపుగా ఏర్పడి కొత్త రాజకీయ పార్టీ పెట్టడం లేదా కలిసి ఒకే పార్టీలో చేరడం వంటి ప్రత్యామ్నాయాలపై నెల రోజులుగా తరచూ చర్చలు జరిపారు. బీజేపీలో కూడా కాంగ్రెస్‌ను వీడిన నేతలకు తగిన ప్రాధాన్యత లభించడం లేదన్న ప్రచారంపై కూడా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ప్రచార కమిటీ చైర్మన్‌గా ఈటలను నియమిస్తారని వార్తలు వచ్చాయి కానీ చివరికి అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో గత మూడు నాలుగు రోజులుగా పొంగులేటి, జూపల్లి, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు విస్తృతంగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. చివరకు బీజేపీని వీడేది లేదని ఈటల, రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. గత కొద్ది రోజులుగా పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్‌లో చేరుతారని ప్రచారం సాగుతోంది. వీరితో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు, కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ఇద్దరు ముగ్గురు జెడ్పీ చైర్మన్లు కూడా ప్రచారంలో పాల్గొంటారు.
Somu Veerraju: దమ్ముంటే చర్చలకు రావాలంటూ.. చంద్రబాబుకు సోము వీర్రాజు సవాల్