Site icon NTV Telugu

Revanth Reddy: రాజ్‌ భవన్‌లో ఉగాది వేడుకకు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు రాలేదు..?

తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ నిర్వహించిన ఉగాది వేడుకలు పెద్ద చర్చగా మారిపోయాయి.. సీఎం కేసీఆర్‌, మంత్రులు, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఎవ్వరూ హాజరు కాకపోవడంపై.. గవర్నర్‌ తమిళిసై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. కొందరు బీజేపీ నేతలు కూడా డుమ్మా కొట్టారు.. దీనిపై పీసీసీ చీప్‌ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.. అసలు రాజ్‌ భవన్‌లో ఉగాది వేడుకలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకు రాలేదు? అని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి. సీఎం కేసీఆర్‌కి కోపం వస్తుంది అని రాజ్ భవన్‌లో ఉగాది వేడుకలకు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ హాజరు కాలేదంటూ హాట్‌ కామెంట్టు చేశారు.. కిషన్ రెడ్డి సిటీలో ఉండి కూడా ఎందుకు రాజ్ భవన్ వెళ్లలేదని నిలదీశారు. గవర్నర్ రాజ్ భవన్‌కి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా రాలేదని చెప్తే వాస్తవానికి దగ్గరగా ఉండేదన్నారు రేవంత్‌రెడ్డి.

Read Also: Ukraine Russia War: రైల్వే స్టేషన్‌పై రష్యా దాడి.. చెల్లాచెదురుగా మృతదేహాలు..

Exit mobile version