బీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రానున్న ఎన్నికల కోసం మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే.. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మేము 55 మంది టికెట్లు ఖరారు చేశామని, కేసీఆర్ కంటే నాలుగు అభ్యర్థుల ను ఎక్కువే ఇచ్చామన్నారు. కాంగ్రెస్ తొలి జాబితా విడుదల అయ్యింది.. అభ్యర్థులకు అభినందనలు… కేసీఆర్ తన అభ్యర్థులకు బీఫామ్ ఇచ్చారన్నారు. గతంలో కేసీఆర్ ని అందరూ అనుకరణ చేస్తున్నారు అనే వాళ్ళు. కానీ ఈ మధ్య కేసీఆర్ కాంగ్రెస్ ని ఫాలో అవుతున్నారన్నారు.
అంతేకాకుండా..’బీ ఫామ్ కూడా 51 మందికే ఇచ్చారు. మేము 55 మంది టికెట్లు ఖరారు చేశాం. కేసీఆర్ కంటే నాలుగు అభ్యర్థుల ను ఎక్కువే ఇచ్చాం. సోనియాగాంధీ ఆరు గ్యారెంటీ లు ఇచ్చాకా.. కేసీఆర్ కనపడకుండా పోయారు. చలి జ్వరం వచ్చింది రెస్ట్ అని కేటీఆర్ చెప్పాడు. కేసీఆర్ కి శాశ్వత విశ్రాంతి అవసరం. మా మేనిఫెస్టో తో ఆగం ఐతరు అన్నాడు. మేము మహాలక్ష్మి అంటే సౌభాగ్య లక్ష్మీ అని కేసీఆర్ అన్నాడు. మేము సిలిండర్ 5 వందలు అంటే.. కేసీఆర్ 400 అన్నాడు. సారా వేలం లో పాటల పోటీ జరిగినట్టు మమ్మల్ని కాపీ కొట్టాడు. కేసీఆర్ బుర్ర కూడా కరప్ట్ అయ్యింది. కేసీఆర్ ఆలోచన సామర్థ్యం కోల్పోయారు. కేసీఆర్ స్వయం ప్రకాశి కాదు. కేసీఆర్ పరన్న జీవి. కేసీఆర్ నకలు కొట్టి మేనిఫెస్టో ఇచ్చాడు. మేము 4 వేలు పెన్షన్ ఇస్తాం అన్తే.. ఎలా సాధ్యం అన్నాడు. మరి మీరు ఎలా ఇస్తారు. కేసీఆర్ లెక్క మేము ఉత్తుత్తి హామీ ఇవ్వలేం. హామీ ఇస్తే అమలు చేస్తాం.
కేసీఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టో కి ఇది అమలు చేసే మేనిఫెస్టో నే అని స్పష్టత ఇచ్చారు కేసీఆర్. కర్ణాటక లో డబ్బులు పట్టుకుంది ఎవరివి. పోయింది ఎవడికి. అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడానికి బుర్ర ఉండాలి. సినిమాలో ఐటమ్ సాంగ్స్ కి తీసుకు వచ్చినట్టు మహారాష్ట్ర లో నుండి రోజు నలుగురిని తీసుకువచ్చి చేర్చుకున్నాడు. డబ్బులు ఇచ్చి చేర్చుకుంటుంది మీరు. డబ్బులు పంచుతుంది కాంగ్రెస్ పై brs ఆరోపణ చేస్తుంది. ఈ నెల 17 న అమర వీరుల స్థూపం దగ్గరికి రా. డబ్బులు..మందు ప్రజలకు పంచను అని ప్రమాణం చేద్దాం రా. 12 గంటలకు రండి.. ప్రమాణం చేస్తా.. ప్రభుత్త్వ ఉద్యోగులకు మొదటి తేదీ రోజు జీతం ఇవ్వు. పెన్షన్ దారులకు పెన్షన్ ఇవ్వు. నవంబర్ ఒకటో తేదీన వేసి చూపించు. అప్పుడు ని మేనిఫెస్టో నమ్ముతారు జనం. కేసీఆర్ మాటలు చూస్తే ఆత్మస్థైర్యం కోల్పోయిన వ్యక్తి కనిపించాడు. కేసీఆర్ కి ఎక్స్పైరీ డేట్ వచ్చింది. శేష జీవితం రెస్ట్ తీసుకోండి. ఎన్నికల బరిలోంచి తప్పుకోండి. మీ ఆరోగ్యం.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షిణించింది. 17 వ తేదీ అమరవీరుల స్థూపం దగ్గరకి వచ్చి ప్రమాణం చేసి..ఫార్మ్ హౌస్ కి వెళ్లి రెస్ట్ తీసుకో’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.