Site icon NTV Telugu

Revanth Reddy : సోనియా గాంధీ మీద ఈగ వాలినా అంతు చూస్తాం

Revanth Reddy

Revanth Reddy

గాంధీ కుటుంబం పై అక్రమ కేసుల విషయంలో మోడీ ప్రభుత్వ దమననీతిని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా టీపీసీసీ రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో భాగంగానే రాహుల్ ..సోనియా గాంధీకి బీజేపీ నోటీసులు ఇచ్చిందన్నారు. గాంధీ కుటుంబంకి అండగా ఉంటామని, సోనియా గాంధీ మీద ఈగ వాలినా అంతు చూస్తామని రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. గాంధీ కుటుంబం మీద అక్రమ కేసు పెట్టారని ఆయన ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక దేశ స్వాతంత్య్రం కోసం పెట్టిన పత్రిక అని, దేశ ప్రజల భావోద్వేగం తెలియ జేయాలని పెట్టిన పత్రిక అని, స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పోషించింది హెరాల్డ్ పత్రిక అని ఆయన వెల్లడించారు.

బీజేపీ మతం ముసుగులో నడుస్తున్న కుట్రను తిప్పి కొట్టే పనిలో ఉందని, అందుకే బీజేపీకి భయం వేసి.. ఈడీ కేసులు పెడుతుందోన్నారు. బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామితో కేసు వేయించిందని, అప్పట్లో కాంగ్రెస్ అధికారం లో ఉన్నా… విచారణ జరిపించినదన్నారు. 2015 లో ఈడీ హెరాల్డ్ లో తప్పులేం జరగలేదు అని చెప్పిందని ఆయన గుర్తు చేశారు. కానీ అప్పటి కేసును బీజేపీ ఇప్పుడు మళ్లీ నోటీసులు ఇచ్చిందని ఆయన మండిపడ్డారు.

బీజేపీ దృష్టి మళ్లించే కుట్ర చేస్తుందన్న రేవంత్‌.. పెరిగిన ధరలతో పేదలను వంచించింది బీజేపీనేనని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల దృష్టి మరల్చడానికి రాహుల్..సోనియా గాంధీలకు నోటీసులు ఇచ్చారంటూ ఆయన ధ్వజమెత్తారు. ఈడీ పిలవాలి అంటే.. ఎఫ్‌ఐఆర్‌ నమోదు అవ్వాలని, కానీ ఎఫ్‌ఐఆర్‌ కూడా లేని కేసులో నోటీసులు ఇప్పించింది బీజేపీ అంటూ ఆయన విమర్శించారు.

Exit mobile version