Site icon NTV Telugu

Revanth Reddy: కు.ని ఆపరేషన్ల బాధిత మహిళల్ని ప్రభుత్వం ఆదుకోవాలి

Revanth Reddy

Revanth Reddy

ఇబ్రహీం పట్నం లో 34 మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విషయంలో ఏం జరిగిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అక్కడ 34 మంది ఆపరేషన్ చేయించుకున్నారని, వాళ్లంతా నిరుపేద కుటుంబానికి చెందిన వారే అన్నారు. జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రి దగ్గర రేవంత్ రెడ్డి మాట్లాడారు. అల్లుడు హరీష్ రావు సమర్థుడు అని కేసీఆర్ ఆరోగ్య శాఖ మంత్రిని చేశాడు. ఆయన హయాంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్స్ పై ప్రభుత్వం గొప్పలు చెబుతోంది

కార్పోరేట్ తరహాలో ప్రభుత్వ హాస్పిటల్స్ పనిచేస్తాయని చెప్పారు. 34 మందికి ఒక గంటలో ఆపరేషన్ చేశారు. హైద్రాబాద్ కు కుత వేటు దూరంలో ఈ ఘటన జరిగింది. అయినా ఇన్నిరోజులు ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగింది. అపోలో ఆస్పత్రిలో చాలామందికి ఐసియు లో చికిత్స అందుతోంది. ఈ హాస్పిటల్ లో పేషంట్స్ పర్యవేక్షణ కోసం వైద్య శాఖ అధికారులు లేరు. ఇక్కడికి తెచ్చి జాయిన్ చేసి వదిలేశారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో మంచి నాణ్యమైన వైద్యం అందితే .. కార్పోరేట్ హాస్పిటల్ కు అందుకు తెచ్చారు.

రాష్ట్రంలో ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్వీర్యం గా పనిచేస్తున్నాయి. ఈ ఘటనలో ప్రభుత్వం అసలు విషయాలు దాచిపెడుతున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. మామ అల్లుడు కలిసి ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. చనిపోయిన వారికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. చనిపోయిన కుటుంబాల పిల్లల చదువు ప్రభుత్వం బాధ్యత తీసుకుని చదివించాలి. ఆపరేషన్ చేసుకున్న వారు ఇప్పట్లో పని చేసుకోలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం వారిని ఆర్థికంగా ఆదుకోవాలి. కేసీఆర్ బీహార్ పర్యటన చేయడం కాదు .. ఇక్కడ చనిపోతున్న వారిని పట్టించుకోవాలి. ఈ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునే వరకు వారికి అండగా కాంగ్రెస్ పోరాడుతుందని భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి.

Read Also: CM KCR Bihar Tour: బీహార్‌ సీఎంతో కలిసి చెక్కులు పంపిణీ చేసిన సీఎం కేసీఆర్‌

Exit mobile version