కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విటర్ మాధ్యమంగా సెటైర్స్ వేశారు. ‘‘పొలిటికల్ టూరిస్టులు రావొచ్చు, వెళ్ళొచ్చు. ఒక్క కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణలో ఉంటారు’’ అంటూ తనదైన శైలిలో పంచ్ వేశారు. అంతేకాదు, ఆ డైలాగ్‌కి తగ్గ ఉన్న మేనరిజం ఫోటోను కూడా షేర్ చేశారు. అయితే, ఆ వెంటనే రేవంత్ రెడ్డి కూడా ఆయనకు కౌంటర్ వేశారు. ‘‘కేటీఆర్ గారు.. మీ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్ట్ ప్లేస్ అయి ఉండొచ్చు. కాంగ్రెస్ దృష్టిలో మాత్రం ఈ రాష్ట్రం అమరవీరుల త్యాగఫలం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. మీ వక్రదృష్టి ప్రకారం ఇది టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా.. దానిని సృష్టించింది కూడా కాంగ్రెసే’’ అంటూ ఘాటు రిప్లై ఇచ్చారు.
ఇదిలావుండగా.. తెలంగాణలో తన ఉనికి చాటేందుకు కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే వరంగల్ డిక్లరేషన్ పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో రాహుల్ తెలంగాణ రాష్ట్రంతో పాటు రైతు సమస్యలపై ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, రైతులకు రూ. 2 లక్షల మేర రుణమాఫీ చేయడంతో పాటు రూ. 15 వేలు రైతుల ఖాతాలోకి నేరుగా వేస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో.. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎందరో త్యాగమూర్తుల కారణంగా తెలంగాణ వస్తే, బాగుపడింది మాత్రం ఒక్క కుటుంబమేనని విమర్శించారు. టీఆర్ఎస్-బీజేపీ మధ్య రహస్య పొత్తు కూడా కొనసాగుతోందని ఆయన ఆరోపించారు.

కేటీఆర్ గారూ…మీ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్ట్ ప్లేస్ అయి ఉండొచ్చు!
కాంగ్రెస్ దృష్టిలో ఈ రాష్ట్రం అమరవీరుల త్యాగఫలం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. మీ వక్రదృష్టి ప్రకారం ఇది టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా…
దానిని సృష్టించింది కూడా కాంగ్రెసే. https://t.co/d3Iv53SYnl
— Revanth Reddy (@revanth_anumula) May 6, 2022