CM Revanth Reddy : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బ్యాడ్ బ్రదర్స్.. కిషన్ రెడ్డి, కేటీఆర్.. ఇద్దరు కలిసి మెట్రో విస్తరణ అపుతున్నారని ఆయన ఆరోపించారు. పీజేఆర్.. శశిధర్ రెడ్డి లు హైదరాబాద్ బ్రదర్స్.. హైదరాబాద్ బ్రదర్స్ అభివృద్ధి చేశారు.. బ్యాడ్ బ్రదర్స్.. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ నగరానికి తెచ్చిన గొప్ప వరం.. గంజాయి, డ్రగ్స్ అని ఆయన ఎద్దేవా చేశారు.
నగరాన్ని డ్రగ్స్ అడ్డాగా మార్చాడని, కేదార్ దుబాయ్‌లో డ్రగ్స్ ఎక్కువై చనిపోలేదా..? 111 Goలో ఫార్మ్ హౌస్ లు కట్టుకున్నారు మీరు కాదా..? పదేళ్లలో కేసీఆర్ ఏం చేసిందో.. చర్చ చేయడానికి రెడీ అని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. మేం అభివృద్ధి చేయడానికి బ్యాడ్ బ్రదర్స్ అడ్డంకిగా మారిందని, ఎంఐఎం సహకరించినందుకు.. మెట్రో పనులు జరుగుతున్నాయి.. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కొనసాగుతున్నాయి.. కంటోన్మెంట్‌కి 6 వేల కోట్లు ఖర్చు చేసినా.. ఒక్క ఓటు వేయండి.. మూసీని ప్రక్షాళన చేసుకుందాం అని ఆయన పిలుపునిచ్చారు. యమునా నది ప్రక్షాళనచేయచ్చు.. గుజరాత్ లో నది ప్రక్షాళన చేయచ్చు.. కానీ మూసీ ప్రక్షాళన ఎందుకు వద్దు కిషన్ రెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు.
కేటీఆర్ అనే వాడు.. విష పురుగు.. 44 చెరువులు బీఆర్‌ఎస్ వాళ్ళు ఆక్రమించి అమ్మేశారు.. హైడ్రా మీద విషం చిమ్మేది మీరు కాదా..? బతుకమ్మ కుంట ఆక్రమించుకున్నాడు ఎవడు..? ఎడ్ల సుధాకర్… కేసీఆర్‌కి హెలికాప్టర్‌తో పూలు చల్లాడు అని బతుకమ్మ కుంట ఆక్రమించలేదా..? కేసీఆర్ నజరానాగా ఆయనకు ఇవ్వలేదా..? చెరువు పునరుద్ధరణ చేయాలి అని నా ఆలోచన.. పేదలు ఇబ్బందిపడితే… డబుల్ బెడ్ రూమ్ ఇస్తాం అని చెప్పినా.. హైడ్రా వచ్చిన తర్వాత.. రోడ్లపై నీళ్లు పారేది తగ్గలేదా..? హైడ్రా.. ఈగల్ ఫోర్స్ మీద కేటీఆర్ పగ పట్టిండు.. హైడ్రా తప్పు చేస్తే చెప్పు కలిసి పోదాం.. నిజ నిర్ధారణ చేద్దాం.. నీ ఆలోచన ఏంది.. పార్కులు కబ్జా చేయాలి అంతేనా.. హరీష్ రావు.. కేసీఆర్‌కి అండగా ఉండే వాళ్ళను బయటకు పంపించే పనిలో ఉన్నాడు.. కాల్ సినిమాలో అజయ్ దేవ్ గన్ టైప్ హరీష్.. ఆలె నరేంద్ర నుండి.. ఈటల వరకు.. కేసీఆర్ కి నమ్మకంగా ఉండే వాళ్ళే.. కేసీఆర్ కు నమ్మకంగా ఉండే వాళ్ళను బయటకు పంపాడు..
పదేళ్లు అండగా ఉండండి.. తెలంగాణ అభివృద్ధి చూపిస్తా.. గంజాయి.. డ్రగ్స్ వాడితే.. తొక్కి నారా తీస్తా.. చెరువులు కబ్జా చేసిన వాడు పెద్దోడు ఉంటే.. పగిలి పొద్దీ.. పేదలు ఉంటే.. అండగా ఉందాం.. దీపావళి రోజు గంజాయి కొట్టే వాడు.. రౌడీనా.. గల్లీలో పేదలతో ఉండే వాడు రౌడీనా.. సినిమా వాళ్ళ గెస్ట్ హౌస్‌లో తిరిగిన నువ్వు.. కార్మికుల గురించి ఏం చేశావు.. కమాండ్ కంట్రోల్ సెంటర్ నా క్యాంప్ ఆఫీస్ లెక్క.. కమాండ్ కంట్రోల్ సెంటర్ నా తాత సొమ్మా.. అద్దంలో చూసుకో హరీష్.. నా గురించి మాట్లాడే ముందు.. మీ దేవుడి మొక్కులు కూడా ప్రజల సొమ్ము తోనే తీర్చారు.. దేన్నీ వదిలారు.. కోవిడ్‌ను కూడా వదల లేదు.. ఎన్ని డొనేషన్లు మింగారు.. మన బ్యాండ్ మేళం.. మనం చెప్పిన పాటే పాడతారు..’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Mohammed Shami: ఏంటి రూ. 4 లక్షలు పెద్ద అమౌంట్ కాదా.. షమీకి సుప్రీంకోర్టు నోటీసులు!
