NTV Telugu Site icon

CM Revanth Reddy: సౌత్ కొరియాలో అడుగుపెట్టిన రేవంత్ రెడ్డి.. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని దక్షిణ కొరియా చేరుకున్నారు. పదిరోజుల ప్రణాళికలో భాగంగా ముఖ్యమంత్రి ఏడు రోజుల పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించారు. మంత్రి శ్రీధర్ బాబు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డి కూడా రేవంత్ వెంట దక్షిణ కొరియా వెళ్లారు. అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసిందని రేవంత్ పేర్కొన్నారు. అమెరికాకు కొత్త తెలంగాణను పరిచయం చేశామని రేవంత్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరున్న అమెరికా భారీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయన్నారు.

Read also: Heavy Rains: హైదరాబాద్ లో జోరువాన.. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన..

మొత్తం 19 అంతర్జాతీయ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి అంగీకరించాయి. ఈ క్రమంలో అమెరికాలోని ఆయా కంపెనీలతో చర్చలు, ఓయూలు జరిగాయి. తన అమెరికా పర్యటనలో రాష్ట్రానికి 31,532 కోట్ల పెట్టుబడులు, 30,750 కొత్త ఉద్యోగాలు వచ్చాయని రేవంత్ వెల్లడించారు. అమెరికా వేదికగా తెలంగాణను భావి రాష్ట్రంగా సీఎం రేవంత్ ప్రకటించడంతోపాటు హైదరాబాద్ నాలుగో నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంపిక చేసిన పలు ప్రాజెక్టులను వివరిస్తున్న తీరుకు మంచి స్పందన లభించింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ, మూసీ సుందరీకరణకు పారిశ్రామిక వేత్తల నుంచి మద్దతు లభించిందన్నారు. అమెరికా పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్ సంతృప్తి వ్యక్తం చేశారు.

Read also: Siddhnath Temple: ఆలయంలో భారీ తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి!

తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంపెనీలతో సంప్రదింపులు, చర్చల ద్వారా కొత్త భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టింది. రేవంత్ రెడ్డి నేటి నుంచి దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. యూయూ ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సీఎం భేటీ కానున్నారు. కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్స్ ఇండస్ట్రీ ప్రతినిధులతో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. ఎల్ఎస్ హోల్డింగ్స్ కంపెనీతో ఆయన సమావేశంలో పాల్గొంటారు. ఆయన హ్యుందాయ్ మోటార్స్ సీనియర్ నాయకత్వాన్ని కలవనున్నారు. వాటర్ సర్క్యులేషన్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్ జనరల్‌ను ఆయన కలుస్తారు. దక్షిణ కొరియా నీటి వ్యవస్థను పరిశీలించేందుకు ఈ స్థలాన్ని సందర్శించనున్నారు. ఈ క్రమంలో కొరియా హెరాల్డ్ పత్రికకు రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు.
MS Dhoni Case: 15 కోట్లు మోసం చేశాడంటూ.. ఎంఎస్ ధోనీపై ఛీటింగ్ కేసు నమోదు!

Show comments