Revanth Reddy : కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదేనంటూ ఆయన జోస్యం చెప్పారు. మైనార్టీ అభివృద్ధిని కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఆయన తెలిపారు. కలెక్టర్లుగా ఎంత మందికి అర్హత ఉంది అన్నది చూడాలని ఆయన అన్నారు. ఎస్పీలలో చాలా మందికి అర్హత లేదని ఆయన అన్నారు. అందుకు అధికారులు కేసీఆర్‌కు లాయల్‌గా ఉంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఐదుగురు అధికారుల చేతుల్లో 40 శాఖలున్నాయని.. అధికారుల అండతో సీఎం వేల కోట్లు కొల్లగొడుతున్నారని చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసురించాల్సిన వ్యూహంపై చర్చించారు.
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మనం ఏ పోరాటం చేసినా గృహ నిర్బంధం చేస్తున్నారని.. ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో వేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గచ్చిబౌలి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో వేయడానికి కారణమేంటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మైనార్టీ అభివృద్ధిని కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తామని ఆయన తెలిపారు. సీఎస్ సోమేశ్ కుమార్ దగ్గర 8 శాఖలు ఉన్నాయని, సుల్తానియా దగ్గర 6 శాఖలు ఉన్నాయని సోమేష్ ఆంధ్రకి కేటాయించిన అధికారని ఆయన అన్నారు. మన వాళ్లు కొంత అవగాణ లేకుండా మాట్లాడుతున్నారని, నేను ఉరికేనే మాట్లాడటం లేదన్నారు. తెలివి తక్కవుగా మాట్లాడడం లేదని, ఒక పీసీసీ చీఫ్‌గా మాట్లాడుతున్నానన్నారు. అంతేకాకుండా కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి బడ్జెట్ ఇదేనంటూ రేవంత్ జోస్యం చెప్పారు.
Also Read
- Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!