Site icon NTV Telugu

Renuka Chowdary: ఖబర్దార్ అజయ్ కుమార్ దమ్ముంటే రా.. రేణుక చౌదరి సవాల్

Renuka Chowdary

Renuka Chowdary

Renuka Chowdary: ఖబర్దార్ అజయ్ కుమార్ దమ్ముంటే రా.. అంటూ మాజీ మంత్రి, కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుక చౌదరి సవాల్ విసిరారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ విజయభేరి సన్నాహక సమావేశం కొనసాగుతుంది. ఈ నెల 17న హైదరాబాద్ లో జరగనున్న కాంగ్రెస్ పార్టీ విజయ భేరి బహిరంగ సభపై పార్లమెంటరీ స్థాయి సమావేశానికి ఇన్చార్జిగా మహమ్మద్ ఆరిఫ్ నసీం ఖాన్ లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వి.హెచ్ హనుమంత్ రావు, మాజీ మంత్రి రేణుక చౌదరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రేణుక చౌదరి మాట్లాడుతూ.. 40 ఏళ్లు పని చేసిన వాళ్ళకి కాంగ్రెస్ లో గుర్తింపు రాలేదని రేణుకా చౌదరి అన్నారు. తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి పరిస్థితి వుందని, అన్యాయం జరిగేందుకు అవకాశం వుందని తెలిపారు.

ఎవ్వడేమి చేసిన ఖమ్మం కాంగ్రెస్ జిల్లా ఎవ్వరికీ సీటు ఇచ్చిన మోసం చేసిన గెలిచిన వారికి బుద్ది చెబుదామని తెలిపారు. ఎటువంటి వారికి ఈ పార్టీలో స్థానం లేదు.. ముస్తఫా వంటి వారికి అన్యాయం చేస్తే స్పందించే వాళ్ళు వుండరని తెలిపారు. మూడు సింహాల టోపీ లు పెట్టుకుని అధికార పార్టీ తొత్తులుగా మారుతున్నారని అన్నారు. బీజేపీ కేసీఆర్ వేరెవరూ కాదు… రాబందులు చాలా మంది వున్నారని తెలిపారు. బయట గల్లా పెట్టుకుందాం.. ఇక్కడ అందరం ఒక్కటే నినాదంగా వుండాలని తెలిపారు. నాకు చేదు నిజం చెప్పే అలవాటు ఉందని అన్నారు. 40 సంవత్సరాల నుండి పార్టీ కోసం పనిచేసిన కొంతమంది నాయకులకు గౌరవం దక్కట్లేదని అన్నారు. ఖబర్దార్ అజయ్ కుమార్ దమ్ముంటే రా అని సవాల్ విసిరారు. పోలీస్ సిబ్బందిని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసు బ్రదర్స్ గాలి మారిపోయింది .. రాబోయేది కాంగ్రెస్ ఉండబోయేది కాంగ్రెస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై పువ్వాడ అజయ్ కుమార్ ఎలా స్పందిస్తారు అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
Ponguleti: పార్టీకి నష్టం కలిగించొద్దు.. ఇప్పటికే పలుచన అవుతున్నాం

Exit mobile version