NTV Telugu Site icon

Rega Kantha Rao: కాంగ్రెస్‌ గూటికి మాజీ ఎమ్మెల్యే.. టీఆర్ఎస్‌ కౌంటర్‌ ఎటాక్‌

Rega Kantha Rao

Rega Kantha Rao

రాజకీయంగా పోటీని తట్టుకోలేని వారు పార్టీ నుంచి వెళ్లిపోవడం సహజమేనని దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌, టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు… అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వరరావు టీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా రేగా కాంతారావు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. అటువంటి వారు పార్టీ నుంచి వెళ్లి పోయినందువల్ల ఎటువంటి నష్టం లేదని అన్నారు. అదే విధంగాతన నియోజకవర్గానికి చెందిన కరకగూడెం జడ్పీటీసీ కాంతారావుకు వంద ఓట్లు కూడ లేవని ఆయన వల్ల పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు.. వెళ్లినందు వల్ల ఎటువంటి నష్టం లేదని కూడ రేగా అన్నారు. ఇకపోతే కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఉన్నందు వల్ల ఇక్కడ నుంచి ఇంకొకరు పోటీ చేస్తామని చేసే ప్రకటనలకు అర్ధం ఉండదని అన్నారు.

Read Also: Attack: యాదాద్రి జిల్లాలో దారుణం.. ఒంటరిగా ఉన్న యువతి గొంతు కోసి..!

కాగా, హైదరాబాద్‌ గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు తాటి వెంకటేశ్వరరావు.. పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు రేవంత్‌రెడ్డి.. ఈ సందర్భంగా తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం టీఆర్ఎస్‌ పార్టీలో చేరి మోసపోయామన్నారు.. ఏజెన్సీ ప్రాంత రైతులను కేసీఆర్‌ మోసం చేశారని ఆరోపించిన ఆయన.. పోడు భూముల పట్టాలు ఇస్తా అని ఎనిమిదేళ్లు నుండి మోసం చేస్తున్నారని మండిపడ్డారు.. ఇక, వరంగల్‌ వేదికగా రాహుల్ గాంధీ ఇచ్చిన డిక్లరేషన్ నచ్చింది.. పోడు భూములకు పట్టాలు ఇస్తా అని రాహుల్ గాంధీ మాటలు నమ్ముతున్నాం.. అందుకే కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నామని ప్రకటించారు తాటి వెంకటేశ్వర్లు.. ఈ కార్యక్రమంలో మామిడి జెడ్పీటీసీ కాంతారావు సహా మరికొందరు నేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.